ప్రకృతి సేద్యం అన్ని వేళలా ఆదాయం ఇస్తుంది : సీఎం చంద్రబాబు నాయుడు

-

సంక్రాంతి పండుగ సంబురాల కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత గ్రామం నారావారిపల్లెకు వెల్లిన విషయం అందరికీ తెలిసిందే. అక్కడ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు కార్యక్రమాల్లో పాల్గొని వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. వ్యవసాయ రంగంలో అనేక మార్పులు వస్తున్నాయని సూచించారు. చాలా మంది రైతులు ఇప్పుడు హార్టికల్చర్ వైపు మొగ్గు చూపుతున్నట్టు చెప్పుకొచ్చారు.

అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కువగా వరి, చెరుకు పండించే వారని.. ఇప్పుడు పళ్ల తోటలు, పూలతో తోటలు, కూరగాయల సాగు వేస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మైక్రో ఇరిగేషన్ కు 90 శాతం సబ్సీడీ ఇస్తున్నామని ప్రకృతి సేద్యం అన్ని వేళలా ఆదాయం వస్తుందని.. రైతులందరూ ఈ దివగా ముందుకు సాగాలన్నారు. ప్రపంచ దేశాలను పాపులేషన్ కరువు పట్టి పీడిస్తుందని.. మన రాష్ట్రం దేశంలో అలాంటి పరిస్థితి నెలకొనకుండా ఉండేందుకు స్థోమత కలిసిన ప్రతీ ఒక్కరూ వీలైనంత మంది పిల్లలను కనాలని సూచించారు సీఎం చంద్రబాబు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version