ప్రతీ పల్లె, ప్రతి ఇల్లు ఆనందంగా ఉండాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తాజాగా నారావారిపల్లెలో మీడియాతో మాట్లాడారు. విజన్ 2047 తయారు చేసి ముందుకు వెళ్తామన్నారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామన్నారు. పింఛన్లకు ఏటా రూ.33వేల కోట్లు ఇస్తున్నామని తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో మోసాలు జరుగకుండా సాంకేతికతను వినియోగిస్తున్నామని చెప్పారు సీఎం చంద్రబాబు.
రైతుల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అడిగిన ప్రతి ఒక్కరికీ డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అందిస్తామని, పశువులకు షెడ్లు నిర్మిస్తామని ప్రకటించారు. కిరాణా, దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ చేపడతామన్నారు. ప్రజల ఆదాయం పెంచడం, పర్యావరణ పరిరక్షణే తన లక్క్ష్యం అన్నారు. దేశంలో అత్యధిక పింఛన్లు ఇస్తున్న రాష్ట్రం మనదే అన్నారు చంద్రబాబు. ప్రభుత్వ సాయం వల్లనే చాలా మంది చదువున్నారు. కొందరూ కష్టపడి చదువుకొని విదేశాలకు వెళ్లారు. గ్రామాల్లో పేదలుగా ఉండిపోయిన వారికి మార్గదర్శకాలు చేయాలని. పేదరికాన్ని తగ్గించడం కోసమే పీ4 విధానాన్ని తీసుకొచ్చామని తెలిపారు.