Khiladi Review: “ఖిలాడి” సినిమా ట్విట్టర్ రివ్యూ…

-

మాస్‌ మహారాజ్‌ రవితేజ… యాక్షన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ఖిలాడీ. రమేష్‌ వర్మ దర్శ కత్వంలో రూపొందింతున్న ఈ సినిమా ను ఏ స్టూడియోస్‌ ఎల్‌ ఎల్పీ పతాకం పై సత్య నారాయణ కోనేరు, వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా కు సౌండ్‌ ట్రాక్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ దేవి శ్రీ ప్రసాద్‌ స్వర పరస్తున్నారు. ఇందులో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌, ముకుందన్‌, మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే.. ఈ సినిమా ఇవాళ థియేటర్లలో రిలీజ్‌ అయింది.

 

ఈ నేపథ్యంలోనే… ఖిలాడీ సినిమాకు ట్విట్టర్‌ లో రివ్యూలు ఇస్తున్నారు నెటిజన్లు. మెజారిటీ ప్రేక్షకులు ఖిలాడి సినిమా ఫస్టాఫ్ బాగుందని చెబుతున్నారు. సెకండాఫ్ మూవీ పెదవి విరుస్తున్నారు. సెకండాఫ్ మూవీ కొంచెం సాలిడ్ గా ఉంటే బాగుండేదని ట్వీట్లు చేస్తున్నారు. ఫస్టాఫ్ మూవీ మాత్రం అలరించిన అంటూ ట్వీట్ చేస్తున్నారు నెటిజన్లు. మరికొంతమంది మాత్రం ఫస్ట్ వన్ అవర్ సినిమా అదరగొట్టిo దని చెబుతున్నారు.

ఇంటర్వెల్ ట్విస్టు మాత్రం ఊహించలేము.. అంత అద్భుతంగా ఉంది అంటూ ట్వీట్ చేస్తున్నారు ప్రేక్షకులు. ఇక ఇప్పటిలాగే మాస్ మహారాజ రవితేజ ఫర్ఫార్మెన్స్ కు మంచి మార్కులు పడుతున్నాయి. రవితేజ డైలాగ్స్ ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. అటు ఈ సినిమాకు హీరోయిన్ మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హైలెట్ గా నిలుస్తాయని చెప్తున్నారు. ఫస్టాఫ్ మాత్రమే పాజిటివ్ రావడం.. సెకండాఫ్ పై ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో సినిమా ఎలాంటి ఫలితాలను రాబడుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version