రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరికెక్కిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మించింది. జయరాం, మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్, కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం.. భిన్న నేపథ్యాలు కలిగిన ఓ జంట ప్రేమ కథతో రూపొందింది. ఈ చిత్రం సెప్టెంబర్ 1వ తేదీన తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషలలో విడుదల కానుంది.
ఈ చిత్రానికి హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతం సమకూరుస్తున్నారు. జి మురళి చాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే సినిమా విడుదలకు సమయం దగ్గర పడడంతో మూవీ ప్రమోషన్స్ ని పరుగులు పెట్టిస్తుంది ఖుషి టీమ్.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ ట్రైలర్ లో సమంత – విజయ్ దేవరకొండ మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది. లవ్, రొమాన్స్, పెళ్లి, గొడవలు, ఎమోషన్లతో ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది. ‘భర్త అంటే ఎలా ఉండాలో ఈ సమాజానికి చూపిస్తా’ అంటూ విజయ్ దేవరకొండ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.