మీ వెంట్రుకులు చిట్లిపోకుండా ఉండాలంటే.. ఇలా చేయండి..!

-

ప్రతి ఒక్కరు కూడా అందమైన కురులని సొంతం చేసుకోవాలని అనుకుంటారు. అందమైన కురులని పొందడం అంత సులభం కాదు. చాలామంది అనేక రకాల జుట్టు సమస్యలతో బాధపడుతూ ఉంటారు జుట్టు రాలిపోవడం, జుట్టు చిట్లిపోవడం ఇలా.. జుట్టు చిట్లిపోకుండా జుట్టు బాగుండాలంటే ఇలా చేయండి చాలామంది పొడవు చుట్టూ వున్నా కూడా చివర్లో వెంట్రుకలు చిట్లి పోయి ఇబ్బంది పడతారు.

 

వెంట్రుకలు డామేజ్ కావడానికి దారితీస్తుంది అందువల్ల కొన్ని చిట్కాలను పాటించి నివారించుకోవచ్చు. వెంట్రుకలని బాగా ఉంచుకోవడానికి జుట్టు చివర్లలో అలోవెరా జెల్ ని రాసి మసాజ్ చేయండి ఇది వెంట్రుకలని మృదువుగా మారుస్తుంది కోడిగుడ్డుని జుట్టుకి పట్టించడం వలన వెంట్రుకలు పొడిగా మారుతాయి. గుడ్డులోని తెల్ల సొన తీసుకొని కొంచెం నిమ్మరసం కలిపి వెంట్రుకలని మసాజ్ చేస్తే చక్కటి ఫలితం కనబడుతుంది. ఉల్లిపాయ రసాన్ని కూడా మీరు రాసుకోవచ్చు.

వెంట్రుకలు డామేజ్ ని రిపేర్ చేస్తుంది. పెరుగుని కూడా తలకి పట్టించి మీరు అందమైన కురులని సొంతం చేసుకోవచ్చు. కురులు బాగుండాలంటే బొప్పాయి కూడా బాగా పనిచేస్తుంది బొప్పాయిలో కొంచెం పెరుగు కలిపి జుట్టుకి పట్టిస్తే చక్కటి ఫలితం కనబడుతుంది. ఇలా వెంట్రుకలు చిట్లిపోకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. కొబ్బరి నూనె కూడా ఇందుకు బాగా పనిచేస్తుంది కొబ్బరి నూనె కూడా మీరు తలకి పట్టిస్తే జుట్టు చిట్లి పోవడం వంటి బాధలు ఉండవు జుట్టు బాగుంటుంది. ఆర్గాన్ ఆయిల్ ని కూడా ఉపయోగించవచ్చు. ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ జుట్టుని బాగా ఉంచగలవు తేనెను కూడా మీరు అప్లై చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version