తొలి ముద్దుపై కియారా క్రేజీ కామెంట్స్..!

-

తెలుగు చిత్ర పరిశ్రమలో తక్కువ టైంలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న నటి కియారా అద్వానీ. మ‌హేష్ బాబు లాంటి సూప‌ర్ స్టార్ సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ఆ సినిమా హిట్ తర్వాత.. రామ్ చ‌ర‌ణ్ సరసన ‘విన‌య విధేయ రామ’లోనూ తన అంద చందాలతో భాగానే ప్రేక్షకుల్నీ ఆకర్షించింది.

Kiyara

ఇక ఇండస్ట్రీలో అవకాశాలు ఎలా పట్టాలో తెలిసిన హీరోయిన్. తన ఫీలింగ్స్, వ్యక్తిగత విషయాలు చెప్పడంలో ఏ మాత్రం మొహమాటపడదు ఈ బ్యూటీ. అందుకే మీడియా అటెన్షన్‌ ఎప్పుడూ ఆమెపై ఉంటుంది. ఆన్‌ స్క్రీన్‌లో బోల్డ్ సీన్స్‌తో రెచ్చిపోయే కియారా.. ఆఫ్‌ స్క్రీన్‌ బోల్డ్ స్టేట్‌మెంట్స్‌తో అంతకు మించి రచ్చ చేస్తుంటారు. తాజాగా మరోసారి మీడియాకు ఫుల్‌ మీల్స్‌ లాంటి స్టేట్‌మెంట్‌ ఇచ్చారు కియారా అద్వానీ.

అయితే తొలి ముద్దు గురించి తన మనసులోని మాటలను బయటపెట్టారు ఈ మద్దుగుమ్మ. తన ఫస్ట్ డేట్‌లో పార్టనర్‌కు కిస్‌ ఇచ్చే ప్రసక్తే లేదని తెగేసి చెప్తున్నారు. డేట్‌కి వెళ్లిన అమ్మాయి ముద్దు ఇవ్వకపోతే బాయ్‌ఫ్రెండ్ హర్ట్ అవుతాడన్నదే కదీా మీ డైట్..?. ఈ ప్రశ్నకు కియారా వద్ద ఆన్సర్ ఉంది. ఊరించి వెంటపడేలా ఫస్ట్ డేట్‌లో జస్ట్‌ లుక్స్‌.. ఆ తరువాతే ముద్దులు ముచ్చట్లు అంటూ హోయలు పోతుంది ఈ బ్యూటీ.

అయితే ప్రజంట్ తాను సింగల్ అని చెప్పిన ఈ బ్యూటీ.. తాను బాగా ఇష్టపడే ప్రదేశం మాల్దీవ్స్ అని, అక్కడి స్కూబా డైవింగ్ అంటే ఎంతో ఇష్టమని వెల్లడించింది. మనసుకు నచ్చిన వాడు దొరికితే డేటింగ్ చేయడానికి వెనకాడనని తెలిపింది. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘భరత్ అనే నేను’, రామ్ చరణ్‌తో ‘వినయ విధేయ రామ’ సినిమాలు చేసిన కియారా అద్వానీ.. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version