410 contract employees laid off in AP Fibernet: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంట్రాక్టు ఉద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం మరో ఊహించని షాక్ ఇచ్చింది. ఏపీ ఫైబర్ నెట్ లో 410 మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది చంద్రబాబు నాయుడు సర్కార్. మరో 200 మంది తొలగింపు కు రంగం సిద్ధం చేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం.
గత వైసిపి ప్రభుత్వం హయాంలో మంత్రులు ఎమ్మెల్యేలకు ఫైబర్ నెట్ నుంచి జీతాలు చెల్లించారంటూ… ప్రస్తుత చైర్మన్ జీవి రెడ్డి సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే… ఫైబర్ నెట్ లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించారట. అంతేకాదు మాజీ ఎండి మధుసూదన్ రెడ్డికి సోకజ్, లీగల్ నోటీసులు కూడా ఫైబర్ నెట్ చైర్మన్ జీవి రెడ్డి పంపించడం జరిగింది. వారిపై త్వర లోనే చర్యలు కూడా తీసుకోనున్నారని సమాచారం అందుతోంది.