Official: ‘కింగ్డమ్’.. తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?

-

Kingdom box office collection day 1: రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం “కింగ్డమ్”. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నిన్న థియేటర్లలో రిలీజ్ అయింది. మొదటి షోతోనే ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కాగా కింగ్డమ్ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 39 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించినట్లుగా నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ అనౌన్స్ చేసింది.

Kingdom box office collection day 1
Kingdom box office collection day 1

అమెరికాలో మొదటి రోజు $275K-$300K మధ్య గ్రాస్ కలెక్షన్లను రాబట్టినట్టుగా వెల్లడించారు. కింగ్డమ్ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమాలో విజయ్ సరసన హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే నటించింది. కింగ్డమ్ సినిమాకు అనిరుద్ సంగీతం అందించారు. ఈ సినిమా ఏ మేరకు కలెక్షన్ రాబడుతుందో చూడాలని చిత్ర బృంద సభ్యులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news