హ్యాపీ బర్త్​ డే చిరు తాత.. మెగాస్టార్​కు క్లీంకార స్పెషల్ విషెస్

-

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇక మెగా ఫ్యామిలీ అయితే ఫుల్ పార్టీ మోడ్​లో ఉంది. తన మనవరాలు పుట్టిన తర్వాత తొలి బర్త్ డే కావడంతో చిరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మరోవైపు మెగాస్టార్ బర్త్​డే సందర్భంగా మెగా ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. సోషల్​ మీడియా వేదికగా ఆయన ఫొటోలను వీడియోలను షేర్​ చేస్తూ ట్రెండ్​ చేస్తున్నారు.

తాజాగా చిరుకు ఓ స్పెషల్ పర్సన్ బర్త్ డే విషెస్ చెప్పారు. ఆ పర్సన్ ఎవరో కాదు ఆయన మనవరాలు క్లీంకార. అదేంటి.. అంత చిన్న పాప ఎలా విష్ చేస్తుంది అనుకుంటున్నారా..? తన కుమార్తె.. తన తండ్రికి బర్త్ డే విష్ చేస్తున్నట్లు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ పోస్టు చేశారు. ‘హ్యాపీయెస్ట్ బర్త్ డే టూ అవర్ డియరెస్ట్ ‘చిరు’త(చిరు తాత). మా, అలాగే కొణిదెల ఫ్యామిలీలోకి అడుగుపెట్టిన కొత్త మెంబర్ నుంచి మీకు బోలెడంత లవ్’ అంటూ ఆ ఫొటో కింద క్యాఫ్షన్​ రాసుకొచ్చారు. ఆ ఫొటోలో పాప ఫేస్​ను కవర్​ చేసి పోస్ట్​ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్​ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version