26 బ్రాంచీలుగా ఏపీఎన్జీవో సంఘం మారనుంది – ఏపీఎన్జీవో అధ్యక్షుడు

-

బైలాలో కొన్ని మార్పులు చేర్పులు చేసామన్నారు ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు. నేడు సాయంత్రం నుంచీ మా సంఘం ఏపీ నాన్ గజిటెడ్ గజిటెడ్ అధికారుల‌ సంఘంగా మారుతుందన్నారు. మెంబర్ షిప్ అధికంగా పెరగడం వల్ల రాష్ట్రంలో 5, జిల్లాల్లో 2, తాలూకాలో 2 పోస్టులు పెంచుతున్నామన్నారు. 26 బ్రాంచీలుగా ఏపీఎన్జీజీఓ సంఘం మారనుందన్నారు. ప్రభుత్వం మా బైలా ఆమోదించిన తరువాత ఈ మార్పులు జరుగుతాయన్నారు.

ప్రభుత్వం మా డిమాండ్లకు సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఇక ఏపీఎన్జీఓ సంఘ నేత విద్యాసాగర్ మాట్లాడుతూ.. నాన్ గజిటెడ్ పోస్టులు చాలా గజిటెడ్ అయిపోయాయన్నారు. అందువల్ల గజిటెడ్ ను కూడా మా సంఘంలో చేర్చి పేరు మార్చామన్నారు. ఏపీఎన్జీజీఓగా మా సంఘం కొనసాగుతుందన్నారు. 26 జిల్లాల్లో 250 పోస్టులు మహిళలకు కేటాయించడం జరుగుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version