Ghani : “గని” నుంచి “కొడ్తే” సాంగ్ రిలీజ్..రచ్చ లేపిన తమన్నా

-

టాలీవుడ్‌ హీరో వరుణ్‌ తేజ్‌.. వరుస హిట్ల తో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే గద్దల కొండ గణేష్‌ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న వరుణ్‌ తేజ్.. ప్రస్తుతం గని అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

అల్లు అరవింద్ సమర్పణలో రెన‌సాన్స్ ఫిలింస్‌, బ్లూ వాట‌ర్ క్రియేటివ్ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద, అల్లు వెంక‌టేష్ (బాబీ) ఈ ‘గని’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్‌ ను వచ్చింది.

ఈ సినిమా ఐటెం సాంగ్‌ ను కాసేపటి క్రితమే వదిలింది చిత్ర బృందం. “కొడ్తే” అంటూ సాగే ఈ ఐటెం సాంగ్‌ లో హీరోయిన్‌ తమన్నా నటించింది. ఇక ఈ సాంగ్‌ విషయానికి వస్తే… ఈ సాంగ్‌ ఆధ్యాంతం.. తమన్నా చుట్టే తిరుగుతుంది. అలాగే.. తన హాట్‌ అందాలతో ఈ సాంగ్‌ తమన్నా రెచ్చి పోయింది. అదిరిపోయే స్టెప్పులు వేసి.. రచ్చ లేపింది తమన్నా. కాగా… ఈ సినిమా ఏప్రిల్‌ 18 కి విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news