ప్రజెంట్ దేశవ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ మేనియా ఉంది. టాలీవుడ్ జక్కన్న ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంతో తెరకెక్కిన చిత్రాన్ని చూసేందుకు సినీ అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించగా, ఈ సినిమాపైన భారీ అంచనాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దర్శక ధీరుడు రాజమౌళి పడ్డ కష్టం గురించి సినీ అభిమానులు, ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు.
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన దిగ్ దర్శకుడిగా రాజమౌళి చరిత్రలో నిలిచిపోతారని అంటున్నారు. ఈ సంగతులు పక్కనబెడితే.. రాజమౌళి చెర్రీతో ‘మగధీర’ సినిమా చేసిన చాలా కాలం తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ చేశాడు. ఈ నేపథ్యంలో మగధీర చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 2010లో విడుదలైన ‘మగధీర’ చిత్రం రామ్ చరణ్ తేజ్ కెరీర్ నిలబెట్టిందని చెప్పొచ్చు.
‘చిరుత’ చిత్రంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయిన చరణ్.. ఈ సినిమాతో రికార్డులు బద్దలుగొట్టడంతో పాటు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ స్థానం ఏర్పరుచుకున్నాడని చెప్పొచ్చు. ఈ చిత్ర విడుదలకు ఒక రోజు ముందర మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరిగిన విషయానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
వాటి ప్రకారం..చిత్రాన్ని ‘మగధీర’ మూవీ యూనిట్‌తో పాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులకు చూపించేందుకు ప్రివ్యూలు వేశారు. షో చూసేందుకు మెగాస్టార్ చిరు, తన భార్య సురేఖతో థియేటర్‌కు వెళ్లాడు. ఈ చిత్ర కథ చిరుకు తెలిసినప్పటికీ విజ్యువల్ వండర్‌గా సినిమా ఎలా ఉంటుందనే భయం ఉందట. కానీ, ఒకసారి పిక్చర్ స్టార్ట్ అయ్యాక తన ఊహకందని విజ్యువల్స్‌ను చూసి మెగాస్టార్ స్పెల్ బౌండ్ అయ్యారు.
ఇక రెండో మూవీలోనే చరణ్ ఇంత చక్కటి పర్ఫార్మెన్స్ చేయడం చూసి మెగాస్టార్ దంపతులు ఆనంద పడిపోయారు. అయితే, సినిమా పూర్తి కాగానే వెంటనే చెర్రీని ఆనందం, భావోద్వేగంతో కౌగిలించుకోవాలనుకున్నారట. కానీ, రామ్ చరణ్ అక్కడ లేరు. ఇంత చిన్న వయసులోనే ఇంత పెద్ద క్యారెక్టర్ ప్లే చేసి, రిస్క్ చేయడం చూసి తనకు భయం వేసిందని, అదే సమయంలో ఆనందం కూడా కలిగిందని చిరు చెప్పారు.
సినిమా చూసొచ్చిన తర్వాత దాదాపు అరగంట పాటు ఇంటి లోపల చిరంజీవి సినిమా గురించి చర్చించారు. తర్వాత మళ్లీ రెండో సారి ప్రివ్యూకు వెళ్దామని సురేఖను రిక్వెస్ట్ చేసి మళ్లీ వెళ్లారు. అలా ఒకే రోజు రెండు సార్లు ‘మగధీర’ చూశారు మెగాస్టార్. తన సినీ జీవితంలో ఏ సినిమాను రెండు సార్లు చూడలేదని, ‘మగధీర’ మాత్రం చూశానని చిరు చెప్పుకొచ్చారు. అలా ఆ రోజు అర్ధరాత్రి ఒంటి గంట వరకు ‘మగధీర’ ఫిల్మ్ గురించే చిరు ఆలోచించారట.