Kotabommali Ps: ఓటీటీలోకి వచ్చేసిన కోటబొమ్మాళి మూవీ

-

శ్రీకాంత్‌ కీలక పాత్రలో నటించిన సినిమా ‘కోట బొమ్మాళి పి.ఎస్‌’. జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై రూపొందిన చిత్రం నవంబర్ 24వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్లు రాబట్టడమే కాకుండా మంచి టాక్ను సొంతం చేసుకుంది. సీనియర్ నటుడు శరత్ కుమార్, పవర్ ఫుల్ లేడీ వరలక్ష్మి శరత్‌కుమార్‌, రాహుల్‌ విజయ్‌, శివాని రాజశేఖర్‌ ఇతరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని తేజ మార్ని తెరకెక్కించారు.

Kotabommali PS is now available for streaming on OTT

అయితే, శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్, శివాని, రాహుల్ ప్రధాన పాత్రలో నటించిన ‘కోటబొమ్మాలి P.S’. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఓట్ల కోసం కులమతాలు, పోలీసు వ్యవస్థను రాజకీయ నాయకులు ఎలా ఉపయోగించుకుంటారు? వారిని ఎదిరించి ముగ్గురు పోలీసులు ఎలా విజయం సాధించారనే కథాంశంతో మూవీ తెరకెక్కింది. నవంబర్ 24న థియేటర్లలో విడుదలైన ఈ క్రైమ్ యాక్షన్ డ్రామా చిత్రం మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version