గాభరాపడ్డ దర్శకుడు సుబ్బు పంజగుట్ట పోలీస్స్టేషన్లో కంప్లయింట్ కూడా చేసాడు. హీరోయిన్ మాత్రం విడియో తీసి నెట్లో పెట్టింది.
ఈమధ్య విడుదలై, మంచి పేరు తెచ్చుకున్న సినిమా ‘రాహు’. దర్శకుడు సుబ్బు పట్టువిడవకుండా కథను నడిపించి ప్రేక్షకులను మెప్పించడంలో విజయం సాధించాడు. ఇందులో కథానాయికగా నటించిన కృతి గార్గ్ మంచి అభినయాన్ని కనబరిచి, ప్రశంసలు అందుకుంది.
నిన్న అకస్మాత్తుగా వంగా సందీప్రెడ్డిగా పరిచయం చేసుకుని, ‘‘ప్రభాస్తో ఒక సినిమా చేస్తున్నాను. నిన్ను హీరోయిన్గా తీసుకోవాలనుకుంటున్నాను. ఒకసారి వెంటనే ముంబయికి రా’’ అని కృతికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అది నిజమే అనుకుని సంబరపడ్డ కృతి వెంటనే బయలుదేరి ముంబయికి వెళ్లిపోయింది. అయితే ఈ విషయాలన్నీ సుబ్బుకు చెప్పి వెళ్లడం వల్లన ఆయన కృతిని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించగా ఫోన్ స్విచాఫ్ వచ్చింది. కంగారుపడ్డ దర్శకుడు వెంటనే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసాడు. పోలీసులు కూడా సీరియస్గా తీసుకుని ఎంక్వయిరీ మొదలుపెట్టారు.
ఇంతలో, హీరోయిన్ కృతిగార్గ్ తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక విడియో పోస్ట్ చేసింది. తాను క్షేమంగా తన ఇంట్లోనే ఉన్నట్లు తెలిపింది. ఆ కాల్ ఫేక్ అని గుర్తుపట్టి, భయపడిపోయి, నేరుగా ఇంటికే వెళ్లిపోయానని, ఫోన్ పనిచేయక పోవడం వల్ల సుబ్బు తనను కాంటాక్ట్ చేయలేకపోయాడని తెలిపింది. ఉదయం నుండి ఎంతో మంది శ్రేయోభిలాషులు సోషల్మీడియా ద్వారా తన క్షేమ సమాచారాల గురించి వాకబు చేయడం చాలా సంతోషానికి గురిచేసిందని, తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని ఇంతగా పొందగలగడం తన అదృష్టమని చెప్పింది.ప్రేక్షకులందరికీ, శ్రేయోభిలాషులకు, దర్శకుడు సుబ్బుకి, పోలీసులకు ధన్యవాదాలు తెలిపింది.
I request the media to not put out wrong news. I was supposed to travel today to Mumbai, where I live, after finishing the promotions for my movie Raahu.
I came home today. It has nothing to do with any movie project or anything else.— Kriti Garg (@kritigarg15) March 2, 2020