అలనాటి నటి రీ ఎంట్రీ.. ‘సర్దార్’లో కీలక పాత్రలో లైలా..

-

అలనాటి నటీమణుల్లో చక్కటి నవ్వు ఉన్న నటిగా లైలాకు మంచి పేరుంది. ఈమె తెలుగులో చేసిన చిత్రాలు కొన్నే అయినా పాపులారిటీ మాత్రం బాగానే సంపాదించుకుంది. శ్రీకాంత్ ‘ఎగిరే పావురమా’ ఫిల్మ్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరికి ఆ తర్వాత చక్కటి అవకాశాలు వచ్చాయి. తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ ‘పెళ్లి చేసుకుందాం’ చిత్రంలో ఈమె పాత్రను తెలుగు సినీ ప్రేక్షకులు బాగా గుర్తుంచుకుంటారు. ఈ సొట్టబుగ్గల సోయగాన్ని చూసేందుకు అప్పట్లో కుర్రకారు ఎగబడిపోయేది.

ఇక ఆ తర్వాత ఈ భామ కోలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లింది. తమిళ్ భాషలోనే కాకుండా కన్నడ భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించిన లైలా.. ఇప్పుడు తెలుగు వెండితెరపైకి త్వరలో రీఎంట్రీ ఇవ్వబోతున్నది. ఇప్పటికే బుల్లితెరపైన ‘జబర్దస్త్’, ‘ఢీ’ డ్యాన్స్ షోలో అలా మెరిసిన లైలా.. త్వరలో సినిమాలోనూ కనబడబోతున్నది.

మ్యారేజ్ తర్వాత చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న లైలా.. దాదాపు 16 ఏళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కనబడుబోతున్నది. ప్రజెంట్ తమిళ్ సినిమాలో నటిస్తోంది. అయితే, ఆ చిత్రంలో తెలుగులోకి కూడా డబ్ అయి రిలీజ్ అవుతుంది. తమిళ్ హీరో కార్తీ నటిస్తున్న ‘సర్దార్’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది.

మిత్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ పిక్చర్ లో ఫాదర్ అండ్ సన్ గా కార్తి డబుల్ రోల్ ప్లే చేస్తున్నారు. ఇందులో సీనియర్ కార్తి సరసన హీరోయిన్ గా లైలా నటిస్తోంది. జూనియర్ కార్తి్కి జోడీగా రాశి ఖన్నా నటిస్తోంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలయినప్పటి నుంచి సినిమాపైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి. చూడాలి మరి ఈ చిత్రం ద్వారా లైలా సినీ కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉంటాయో..

 

Read more RELATED
Recommended to you

Exit mobile version