లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి విషమం….!!

-

భారతీయ సినిమా పరిశ్రమ ఖ్యాతిని పెంచిన గొప్ప గొప్ప సినిమా రంగ ప్రముఖుల్లో సింగర్ లతా మంగేష్కర్ కూడా ఒకరు అని చెప్పక తప్పదు. 1929, సెప్టెంబర్ 28న ఇండోర్ లో జన్మించిన లతా గారు, చిన్నప్పటి నుండి సంగీతం అంటే ఇష్టం ఉండడంతో ఎంతో మక్కువతో నేర్చోవడం జరిగింది. ఇక ఆ తరువాత పెరిగి పెద్దయ్యాక 1945లో తొలిసారిగా సింగర్ గా ఆమె సినీ రంగ ప్రవేశం చేసారు. ఇక అక్కడి నుండి ఆరు భారతీయ ప్రాంతీయ భాషల్లో కొన్ని వేల పాటలను పాడిన లతా గారు, ఎక్కువగా హిందీ, మరాఠీ, బెంగాలీ భాషల్లోనే పాడడం జరిగింది. ఇక 2009 తరువాత ఆమె పాటలు పాడడం తగ్గించారు.

ఇకపోతే గత కొద్దిరోజులుగా తన కుటుంబ సభ్యులతో కలిసి ముంబై లో నివాసం ఉంటున్న ఆమెకు నేటి ఉదయం హఠాత్తుగా శ్వాస కోసం సమస్య రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను సౌత్ ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే నేటి మధ్యాహ్నం వరకు ఈ వార్తను బయటకు రానీయకుండా జాగ్రత్త పడ్డప్పటికీ, కొందరు మీడియా వారి ద్వారా న్యూస్ బయటకు రావడంతో దేశవ్యాప్తంగా ఆమె అభిమానులందరూ ఎంతో ఆందోళనకు గురయ్యారు.

అయితే అక్కడి ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం, ఆమె ఆరోగ్యం ప్రస్తుతం పర్వాలేదని, కాగా ఆసుపత్రికి తీసుకువచ్చిన సమయంలో ఆమెకు ఊపిరి అందడం ఎంతో కష్టంగా ఉందని, అయితే ట్రీట్మెంట్ తరువాత ప్రస్తుతం ఆమె బాగానే ఉన్నట్లు ఆసుపత్రి డాక్టర్లు చెప్తున్నారు. ఛాతిలో ఇన్ఫెక్షన్స్ కారణంగానే ఆమెకు ఈ సమస్య వచ్చిందని, మరొక రెండు రోజులు ఆసుపత్రిలోనే ఉండి రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు వెల్లడించినట్లు లతా గారి కుటుంబసభ్యులు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇక ఆమె ఆరోగ్య పరిస్థితిపై బాలీవుడ్ కి చెందిన పలువురు సినిమా ప్రముఖులు ఎప్పటికపుడు వాకబు చేస్తున్నారని, అలానే ఆమె వీలైనంత త్వరగా కోలుకుని మళ్ళి మాములు మనిషి కావాలని వారు తెలిపినట్లు తెలుస్తోంది…….!!

Read more RELATED
Recommended to you

Exit mobile version