రివైండ్ 2024: ఈ ఏడాది బాక్సాఫీసును షేక్ చేసిన డబ్బింగ్ చిత్రాలివే..

-

తెలుగు ప్రేక్షకులు సినిమా బాగుంటే చాలు అందులో హీరో ఎవరున్నారనేది చూడరు. కంటెంట్ బాగుంటే సినిమాను ఆదరించే లక్షణం ఉన్న తెలుగువారిని ఆకర్షించిన డబ్బింగ్ సినిమాలు ఏంటో చూద్దాం.

ప్రేమలు:

మలయాళం లో రిలీజ్ అయి హిట్ అందుకున్న ఈ చిత్రం తెలుగులోకి డబ్ అయ్యి అంతకుమించి ఘన విజయాన్ని అందుకుంది. నస్లీన్ కే గపూర్, మమత బైజు హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని గిరీష్ ఏ డి డైరెక్ట్ చేశారు. తెలుగులో ఈ చిత్రానికి అమితమైన ఆదరణ రావడానికి మరో కారణం.. ఈ చిత్ర కథ నేపథ్యం పూర్తిగా హైదరాబాద్ కావడమే.

ఈ సినిమాకు తెలుగు మాటలను 90s వెబ్ సిరీస్ దర్శకుడు ఆదిత్య హాసన్ అందించారు.

మంజుమ్మల్ బాయ్స్:

ఎస్ చిదంబరం దర్శకత్వం వహించిన ఈ సినిమాకు తెలుగులో అమితమైన ఆదరణ దక్కింది. తెలుగు ప్రేక్షకులను థియేటర్లలో అలరించిన ఈ చిత్రం.. ఓటిటి ద్వారా మరింత ఎక్కువ మందికి వినోదాన్ని పంచింది. నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ.. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

అమరన్:

శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రం 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. చాలా రోజుల తర్వాత వెండితెర మీద సాయి పల్లవి కనిపించడంతో తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూర్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version