పరిటాల రవి హత్య కేసులో నిందితులకు బెయిల్ మంజూరు

-

పరిటాల రవి హత్య కేసులో నిందితులకు బెయిల్ మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు ముద్దాయిలకు బుధవారం హైకోర్టు బెయిల్ మంజూరు చేసి ఊరగనిచ్చింది. పద్దెనిమిదేళ్ల తరువాత ముద్దాయిలకు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు ధర్మాసనం. రవి హత్య కేసులో పొందిన నిందితులలో ఏ3గా పండుగ నారాయణ రెడ్డి, ఏ4 రేఖమయ్య, ఏ5 బజన రంగనాయకులు, ఏ6 వడ్డెకొండ, ఏ8 ఓబీరెడ్డి ఉన్నారు.

వీరికి బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. కొన్ని షరతులు కూడా విధించింది. రూ.25 పూచీకత్తులు స్థానిక మేజిస్ట్రేట్ లో సమర్పించాలని ఆదేశించింది. ప్రతీ సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ వద్ద హాజరు కావాలని సూచించింది. ముద్దాయిలు విడుదలైన తరువాత చెడు ప్రవర్తన ఉంటే బెయిల్ రద్దు చేస్తామని ధర్మాసనం హెచ్చరించింది. ముద్దాయిలు దరఖాస్తు చేసుకుంటే ముందస్తు విడుదల చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version