మా వదిన నాకు అన్యాయం చేసింది.. సురేఖ పై పవన్ వ్యాఖ్యలు వైరల్..!

-

పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ తాజాగా నటించిన చిత్రం బ్రో.. ఈనెల 28వ తేదీన విడుదలకు సిద్ధం కానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో చాలా గ్రాండ్గా నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తన వదిన సురేఖ తనకు అన్యాయం చేసింది అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. బ్రో సినిమాని ఎక్కువ రోజులు చేయాల్సిన సినిమా.. అయితే నేను రాజకీయాలలోకి వెళ్లడం కారణంగా త్వరగా పూర్తి చేయాల్సి వచ్చింది.

నాకు సినిమా అంటే ప్రాణం సమాజం అంటే బాధ్యత రెండింటిని బ్యాలెన్స్ చేయడం కోసమే త్వరగా కంప్లీట్ చేస్తున్నాము అంటూ వెల్లడించారు.నా దృష్టిలో హీరో అంటే మెగాస్టార్ చిరంజీవి మాత్రమే. ఇక ఎన్టీఆర్, ఏఎన్ఆర్ , కృష్ణ వీరంతా కూడా పెద్ద స్టార్ నటులు. ఇక నేను ఇండస్ట్రీలోకి రావాలని అనుకోలేదు ఏదైనా చిన్న ఉద్యోగం చేస్తూ వ్యవసాయం చేయాలని అనుకున్నాను. ఇక కొన్ని కారణాలవల్ల సాహిత్యం చదవడం, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్లే సినిమాల్లోకి మా వదిన గారు నన్ను తీసుకువచ్చారు.ముఖ్యంగా మనల్ని నమ్మేవారు ఉండాలి అప్పుడే మనమేదైనా సాధిస్తాము.

నేను హీరోగా మారిన తర్వాత సుస్వాగతం సినిమాలోని ఒక పాట షూట్ జగదాంబ సెంటర్లో బస్సు పై ఎక్కి డాన్స్ చేయమని దర్శకుడు చెప్పాడు. అప్పుడు నేను చచ్చిపోయాను. 10 మందిలో నటించడం అంటే నాకు సిగ్గు వెంటనే ఏడ్చేసి మా వదినకు ఫోన్ చేశాను. నన్ను ఎందుకు ఇండస్ట్రీలోకి దొబ్బావు అంటూ ఆమెపై కోప్పడ్డాను. వదిన చెప్పకపోతే నా పాటికి చిన్న జీవితం గడిపేవాడిని. మా వదిన చేసిన ద్రోహానికి నేను ఇలా మీ ముందు ఉన్నాను. అంటూ తెలిపారు పవన్ కళ్యాణ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version