మహేష్ గుంటూరు కారం సినిమాలో హీరోయిన్ ఫిక్స్..!

-

తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం.. ఇప్పటికే సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కాగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ నేపథ్యంలోనే హీరోయిన్గా ఎవరు చేయబోతున్నారు అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. మొన్నటి వరకు పూజా హెగ్డే పేరు వినిపించినా.. ఆమెను తొలగించి శ్రీలీలను ఆ స్థానంలో తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఇప్పుడు మరొక హీరోయిన్ పూజా హెగ్డే స్థానంలో వచ్చినట్లు సమాచారం.

అసలు విషయంలోకి వెళ్తే పూజా హెగ్డేను తొలగిస్తూ వేరే హీరోయిన్ ను తీసుకుంటున్నట్లు కొంతమంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి. కానీ చిత్ర బృందం మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టగా ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రముఖ హీరోయిన్ మీనాక్షి చౌదరి తాను గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నాను అంటూ ఒక వార్తను లీక్ చేసింది. ఇచ్చట వాహనాలు నిలపరాదు, హిట్, ఖిలాడి వంటి సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మీనాక్షి చౌదరి.. విజయ్ ఆంటోనీతో కలిసి హత్య సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో జరగగా మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. గుంటూరు కారం సినిమాలో తాను నటిస్తున్న విషయాన్ని రివీల్ చేసింది. మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. గుంటూరు కారం సినిమాలో అవకాశం వస్తుందని అసలు అనుకోలేదు.. నేను మహేష్ బాబుకు పెద్ద అభిమానిని.. మొదటి షెడ్యూల్ కూడా పూర్తయింది. ఇక మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబో సూపర్ హిట్ కాంబినేషన్.. ఇందులో నటించడం చాలా సంతోషంగా ఉంది అంటూ ఆమె వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version