నెట్టింట వైరల్ అవుతున్న మహేశ్ న్యూ లుక్…!

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు అమ్మాయిల కలల రాకుమారుడిగా ఉన్నాడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆయనకు మ్యారేజ్ అయినప్పటికీ లుక్స్‌లో కుర్రాడిలానే కనిపిస్తుంటాడు. 45 ఏళ్ల వయసులోనూ మహేశ్ ఇలా ఎలా కనిపించగలుగుతున్నాడనేది క్వశ్చన్‌గానే మిగిలిపోతుంది. జిమ్, డైట్ మెయింటేన్ చేయడం వల్లే మహేశ్ అందంగా, ఫిట్‌గా ఉంటారనేది అభిమానుల మాట.

ఆయన ప్రస్తుతం ‘గీతాగోవిందం’ ఫేమ్ డైరెక్టర్ పరశురామ్‌తో ‘సర్కారు వారి పాట’అనే చిత్రంలో నటిస్తున్నారు. కాగా, తాజాగా మహేశ్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో ఫుల్ హల్‌చల్ చేస్తోంది. సదరు ఫొటోలో మహేశ్ ఏజ్ 18 కంటే కొంచెం ఎక్కువ అనేలా ఉందని నెటిజన్లు అప్రిసియేట్ చేస్తున్నారు. నెట్టింట వైరలవుతోన్న మహేశ్ ఫొటో థమ్సప్ యాడ్ సందర్భంగా తీసినది. కాగా, ఇందులో టీనేజర్ లుక్ అదిరిపోయిందంటూ మహేశ్ ఫ్యాన్స్ ఆనంద పడిపోతున్నారు.

ఫొటో చూసి మహేశ్ అతడి కుమారుడు గౌతమ్ కృష్ణకు బ్రదర్‌లా ఉన్నాడని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మహేశ్ బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్‌వీర్‌సింగ్‌తో కలిసి థమ్సప్ యాడ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. థమ్సప్‌కు గతంలో రామ్ చరణ్ తేజ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండగా, ప్రస్తుతం రణ్‌వీర్‌సింగ్‌, మహేశ్ బాబు ఉన్నారు. సోషల్ మీడియాలో మహేశ్ అభిమానులు ఈ ఫొటోను ట్రెండ్ చేస్తున్నారు. కాగా, సదరు ఫొటోలో మహేశ్ ఖాళీ థమ్సప్ బాటిల్‌ను స్టైలిష్‌గా చూపిస్తున్నాడు. మహేశ్ అల్ట్రా మోడ్రన్ లుక్ చూస్తే అప్పటి మహేశ్ గుర్తుకొస్తున్నాడనే కామెంట్లు సోషల్ మీడియాలో కోకొల్లలుగా వస్తున్నాయి. ‘రాజకుమారుడు, యువరాజు’ చిత్రాల నాటి గెటప్‌ను మ్యాచ్ చేసేలా ప్రజెంట్ ‘సర్కారు వారి పాట’ స్టిల్స్ ఉన్నాయని పోలుస్తున్నారు. ఈ చిత్రంలో మహేశ్‌కు జోడీగా మహానటి కీర్తసురేశ్ నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version