Malavika Mohanan: చీర కట్టులో బ్యాక్ చూపి కైపెక్కిస్తున్న మాళవిక మోహనన్..

-

మాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ మాళవిక మోహనన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈ అమ్మడు పోస్ట్ చేసిన ఫొటోలు నెట్టింట హీట్ పెంచేస్తున్నాయి. సంప్రదాయానికి ప్రతీక అయిన చీరకట్టులోనూ సెగలు రేపుతోంది ‘మాస్టర్’ ఫిల్మ్ హీరోయిన్.

ఎరుపు రంగు చీర, రవికలో అలా బ్యాక్ సైడ్ వీపు అందాలు, నడుము, నడుముపైన ఉన్న పుట్టుమచ్చను చూపి..మాళవిక కుర్రకారు మతి పోగొడుతోంది. ఈ ఫొటోలను చూసి నెటిజన్లు ‘అదృష్ట పుట్టుమచ్చ, ఎర్ర గులాబీ, సింపుల్ అండ్ గార్జియస్, మిస్ యూ బేబీ, అరుపులే’ అని కామెంట్స్ చేస్తున్నారు. ‘చీరకట్టులో ఉంటే తాను ఇంకా అందంగా కనబడుతాను’ అనే క్యాప్షన్ తో మాళవిక షేర్ చేసిన ఈ ఫొటోకు నెటిజన్లు, అభిమానుల నుంచి లైకులు వస్తూనే ఉన్నాయి.

 

ఎరుపు రంగు చీరలో అలా కొంగు జరుపు రవికను, వీపును, నడుము భాగాన్ని చూపు హొయలు పోయింది మాళవిక మోహనన్. ‘ఆకాశమే నీ హద్దురా’ ఫిల్మ్ హీరోయిన్ అపర్ణ బాలమురళి ఈ ఫొటోలను లైక్ చేయగా, నెటిజన్లు అయితే బ్యూటిఫుల్ భామ అని తెగ పొగిడేస్తున్నారు.

ప్రస్తుతం మాళవిక మోహనన్ ధనుష్ తో ఓ చిత్రంలో నటిస్తోంది. తెలుగులో తనకు నటించే అవకాశం వస్తే తప్పకుండా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఒక చిత్రం చేస్తానని గతంలో ఈ సుందరి పేర్కొంది. విజయ్ , విజయ్ సేతుపతి కలిసి నటించిన ‘మాస్టర్’ చిత్రం తెలుగులో విడుదల కాగా, ఆ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మాళవిక మోహనన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version