టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంటేనే సంచలనాలకు కేరాఫ్ అడ్రస్. ఆయన మాటలతోనే కాదు సినిమాలతో కూడా వివాదాస్పదమవుతుంటారు. ఇప్పటికే ఎన్నో సంచలన సినిమాలు తీసి తన మార్కును చూపించారు. ఇప్పుడు ఓ కొత్త సినిమాతో వస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరూ టాలీవుడ్లో తీయని సినిమాతో సంచలనంగా మారారు.
ఇద్దరు అమ్మాయిలు లెస్బియన్‌గా మారితే ఎలా ఉంటుందనే కొత్త కథతో ఆర్జీవీ తీశాడు. ఓ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న “డేంజరస్ “లో ఇద్దరు అమ్మాయిల మధ్య రొమాన్స్‌ను హైలెట్ చేస్తున్నాడు ఆర్జీవీ. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ అంచనాలు పెంచేశాయి. ఇక ఈ “డేంజరస్ “సినిమా ఏప్రిల్ 8 వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యం లో వర్మ కు షాక్ తగిలింది.
రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం డేంజరస్ ను ప్రదర్శించేందుకు పివిఆర్ సినిమాస్, ఐనాక్స్ సినిమాస్ అర్ధాంతరంగా తిరస్కరించాయి. ఈ విషయాన్ని స్వయంగా వర్మనే తన సోషల్ మీడియాలో ప్రకటించాడు. ఇద్దరు మహిళల మధ్య స్వలింగ సంపర్కం నేపథ్యంలో… ఆ సినిమాను ప్రదర్శించలేమని ఐనాక్స్, పివిఆర్ పేర్కొన్నట్లు ఆయన వివరించారు. సెన్సార్ బోర్డు ఓకే చెప్పినప్పటికీ ఇలా వారు వ్యవహరించడం అన్యాయమన్నారు.
I request not only the #LGBT community but also everyone to stand up against the management of @_PVRcinemas and @INOXCINEMAS for their ANTI #LGBT stand ..This is an insult to human rights pic.twitter.com/HgaIYw9mbA
— Ram Gopal Varma (@RGVzoomin) April 5, 2022