నేడు ఈడి విచారణకు మంచు లక్ష్మి

-

నటి మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మోహన్ బాబు వారసురాలిగా చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తనదైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా… నటి మంచు లక్ష్మి ఈరోజు ఈడి విచారణకు హాజరు కాబోతున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో మంచు లక్ష్మికి ఈడి అధికారులు గతంలోనే నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

manchu laxmi
Manchu Lakshmi to appear in ED inquiry today

నగదు లావాదేవీలు, బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులతో ఆమెకు ఉన్న సంబంధాలపై ఈడి మంచు లక్ష్మీని ప్రశ్నించే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఈ కేసులో నటుడు ప్రకాష్ రాజ్, హీరో విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానాను అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నటి మంచు లక్ష్మిని విచారణకు పిలిచారు. విచారణ అనంతరం అసలు విషయం బయటకు రానుంది. విచారణకు మంచు లక్ష్మి హాజరు అవుతారా లేదా అనే సందేహాలు సైతం తలెత్తుతున్నాయి. ఒకవేళ విచారణకు వచ్చినట్లయితే మంచు లక్ష్మి ఎలాంటి సమాధానాలు చెబుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news