ఈ ఆధునిక జీవన విధానంలో ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద తేడా లేకుండా ఇబ్బంది పడే సమస్య గ్యాస్. సాధారణంగా యాంటాసిడ్స్ లేదా యాంటీ-ఫ్లాటులెంట్ మందులు గా పిలవబడేవి గ్యాస్ టాబ్లెట్లు. ఇవి అజీర్తి, గ్యాస్, గుండెల్లో మంట కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు తాత్కాలికంగా ఉపశమనం కలిగిస్తాయి ఇవి సాధారణంగా ఓవర్ ది కౌంటర్ ఔషధాలుగా లభిస్తాయి. చాలామంది వ్యక్తులు వీటిని సులభంగా ఉపయోగిస్తారు. అయితే గ్యాస్ టాబ్లెట్లను అధిగా ఉపయోగించడం వలన దీర్ఘకాలికంగా శారీరక ప్రమాదాలు సంభవించవచ్చు గ్యాస్ టాబ్లెట్లు అధికంగా వాడడం వల్ల కలిగే దుష్ప్రభావాలను, జాగ్రత్తలను వివరంగా తెలుసుకుందాం..
గ్యాస్ టాబ్లెట్లను ఇచ్చిన వాటికంటే అధిక మోతాదులో వాడడం వలన కిడ్నీ సమస్యలు దారి తీయవచ్చు. ఇందులో ఉండే యాంటాసిడ్స్ లోని అల్యూమినియం మెగ్నీషియం, పదార్థాలు శరీరంలో పేరుకు పోయి కిడ్నీ సమస్యలను కలిగిస్తుంది. అంతేకాక దీర్ఘకాలికంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఈ టాబ్లెట్స్ డాక్టర్ సలహాతో వాడడం మంచిది.
శరీరంలోని సోడియం మెగ్నీషియం క్యాల్షియం వీటి స్థాయిని, ఎప్పటికప్పుడు సమానంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. రక్తపోటు కలగవచ్చు, అంతేకాక డయేరియా ,లాంటివి సంభవిస్తాయి ఎలక్ట్రోలైట్ సమస్యలు ఉన్నవారు ఈ ఔషధాలను జాగ్రత్తగా వాడాలి.
ఇక గ్యాస్ టాబ్లెట్లు అధికంగా వాడడం వలన కడుపులో మంట ఎక్కువ జీర్ణ క్రియను దెబ్బతీస్తుంది. దీర్ఘకాలంగా ఈ గ్యాస్ట్రిక్ టాబ్లెట్లను ఉపయోగించడం వల్ల ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది. గ్యాస్ టాబ్లెట్లను భోజనం సమయంలో కాకుండా భోజనం తర్వాత తీసుకోవడం మంచిది. మలబద్ధకం, డయేరియా వంటి వ్యాధిగ్రస్తులు ఈ టాబ్లెట్లను తగ్గించడం ఎంతో ముఖ్యం. ఇక అంతేకాక దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వారు వాడుతున్న టాబ్లెట్స్ తో పాటు గ్యాస్ టాబ్లెట్లను వాడడం ప్రమాదం. గ్యాస్ టాబ్లెట్ తో పాటు ఇతర ఔషధాలను తీసుకునేటట్లయితే వాటికి మధ్య కనీసం ఒక గంట వ్యవధి ఉంచడం మంచిది.
గ్యాస్ సమస్యలకు ఎక్కువగా టాబ్లెట్స్ పై ఆధారపడకుండా సహజ పద్ధతులను పాటించవచ్చు. మన ఆహార అలవాటులను మార్చుకోవడం జీవనశైలిలో మార్పు చేసుకోవడం సహజం ఔషధాలను ఉపయోగించడం ఉదాహరణకు అల్లం టీ, లేదా పుదీనా టీ, సోంపు వాటర్ వంటి వాటిని తాగడం వల్ల అజీర్తి సమస్యలు తగ్గి గ్యాస్ ప్రాబ్లమ్స్ దరి చేరవు.
గ్యాస్ అజీర్తి, సమస్యలు తరచూ వస్తుంటే దానికి కారణం తెలుసుకోవడానికి దగ్గరలోని వైద్యున్ని సంప్రదించండి.