మంచు మనోజ్ కు 20తేది కి సంబందం అదేనా..!!

-

టాలీవుడ్ లో మంచు కుటుంబం ది ఒక ప్రత్యేక మైన గుర్తింపు వుంది. ఒకప్పుడు ఈ ఫ్యామిలీ పై అందరూ గౌరవం తో వుండే వారు.రాను రాను వారి సెల్ఫ్ డబ్బా ఎక్కువ అయ్యింది అని , కొంత బిహేవియర్ ప్రాబ్లమ్స్ వల్ల మరియు సినిమాలలో కంటెంట్ సరిగా లేకపోవటం తో వారి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. రీసెంట్ గా దీపావళి కు వచ్చిన మంచు విష్ణు  చిత్రం   జిన్నా కూడా ప్లాప్ అయ్యింది. అంతకు ముందే మంచు మనోజ్ సినిమాలు చేయటం మానేశాడు.

ఇక ఎప్పటినుండో మంచు మనోజ్ తన కుటుంబం నుండి దూరంగా ఉంటున్నాడు అనే ప్రచారం జరుగుతోంది. గతంలో  పెళ్లి చేసుకుని విడాకులు కూడా తీసుకోవడం జరిగింది. మళ్లీ తాను భూమా మౌనిక ను పెళ్లి చేసుకో బోతున్నట్లు గతంలో లో ప్రకటించారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం వీరిద్దరి వివాహ ముహూర్తం ఖరారైనట్లు సమాచారం అందుతోంది. రీసెంట్ గా మంచు మనోజ్ కడపలో ఉన్న పెద్ద దర్గా అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్నారు. ఫిబ్రవరి నుంచి కొత్త జీవితం ప్రారంభించనున్నట్లు చెప్పుకొచ్చారు.

మనోజ్ చెప్పినట్లుగా ఫిబ్రవరిలో వీరిద్దరి వివాహానికి ముహూర్తం ఖారారైనట్లు సమాచారం. తాజాగా ఒక ట్వీట్ లో తనకు అభిమానుల బ్లెసింగ్ కావాలని కోరుతూ ట్వీట్ చేస్తూ  జనవరి ఇరవయ్యో తేదీన ముఖ్యమైన విషయం అనౌన్స్ చేయబోతున్నట్లు గా చెప్పాడు. దీనితో నెటిజన్స్ అందరూ మంచు మనోజ్ పెళ్లి చేసుకో బోటున్నట్లు గా భావించి అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version