తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని నటుడు మంచు విష్ణు స్పష్టతనిచ్చారు. భారీ బడ్జెట్ తో ‘భక్తకన్నప్ప’ అనే పాన్ ఇండియా చిత్రాన్ని తీయనున్నామని… సెప్టెంబర్ లో షూటింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ సినిమాలో ఎన్నో సర్ ప్రైజ్ లు ఉంటాయని అన్నారు. ప్రస్తుతం ఓ రియాల్టీ షో చేస్తున్నామని… చాలా ప్రశ్నలకు అందులో సమాధానాలు లభిస్తాయని చెప్పారు.
పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ అని… అందులో ఎలాంటి సందేహం లేదని నటుడు మంచు విష్ణు అన్నారు. సినిమాలపరంగా ఆయన పవర్ ఏంటో అందరికీ తెలుసని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే పవన్ రాజకీయాల్లో విజయం సాధిస్తారా అనే ప్రశ్నకు… విజయం సాధిస్తారో లేదో చెప్పడానికి తానేమీ బ్రహ్మంగారు కాదని చెప్పారు. సినిమా పరంగా ఆయన గురించి చెప్పగలనని… పవన్ సినిమా ఆడకపోయినా తదుపరి చిత్రానికి భారీ కలెక్షన్స్ వస్తాయని తెలిపారు.