‘స్వర్ణ గ్రామం’ పేరుతో ఐఏఎస్​ల పల్లె నిద్ర : సీఎం చంద్రబాబు

-

స్వర్ణగ్రామం పేరుతో పల్లెనిద్ర చేయాలని ఐఏఎస్ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఉన్నతాధికారులు 3 రోజుల 2 రాత్రులు పల్లెనిద్ర చేయాలని సూచించారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులతో సీఎం చంద్రబాబు పలు అంశాలపై మాట్లాడారు. ప్రజలకు ఎంతో చేసినా సరైన ప్రచారం చేసుకోలేకపోతున్నామని అన్నారు.

శాఖలకు స్వయం ప్రతిపత్తి కల్పించే దిశగా ఆప్కాస్​ను ఎలా వినియోగించాలనే అంశంపై మంత్రులతో సీఎం చర్చించారు. ఆప్కాస్​పై ఓ మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని.. . ప్రతి శాఖ కేంద్ర పథకాలను అధ్యయనం చేసి రాష్ట్రానికి నిధులు వచ్చేలా ప్రయత్నం చేయాలని మంత్రులకు చంద్రబాబు సూచించారు. రుషికొండపై జగన్ నిర్మించిన భవనాలను ఏం చేయాలన్న దానిపై మరోసారి చర్చిస్తూ.. మంత్రులంతా రుషి కొండ ప్యాలస్​ను సందర్శించాలని.. ఆ తర్వాత ఏం చేద్దామన్న అంశంపై అభిప్రాయాలు చెప్పాలని చంద్రబాబు సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version