తెలంగాణలో EAPCET-2025 దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. అర్హత గల అభ్యర్థులకు ఈ ఎంట్రన్స్ ద్వారా ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500 ఉండగా.. ఇతరులు రూ.900 చెల్లించాల్సి ఉంటుంది. అగ్రికల్చర్, ఇంజినీరింగ్ రెండు స్ట్రీమ్ లకు దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీలకు రూ.1000, ఇతరులకు రూ.1800 చెల్లించాల్సి ఉంటుంది.
వచ్చే నెల 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష ఈనెల 29, 30 తేదీలలో అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు నిర్వహించనున్నారు. మొదటి సెషన్ పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ EAPCET.TGCHE.AC.IN ని సందర్శించండి.