వెన్నెల కిశోర్ ఇంట్లో కుప్పలుగా రూ.2000 నోట్లు !

-

ఆరేళ్ళ క్రితం మోదీ ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు పై కీలక నిర్ణయం తీసుకుంది.. దాంతో పెద్ద నోట్లు రద్దు చేసి,వాటి స్థానంలో కొత్త నోట్లను తీసుకుని వచ్చింది.అప్పటి నుంచి కొత్త 2000 రుపాయల నోట్లు అందుబాటులోకి వచ్చాయి.ఈ మధ్య కాలంలో ఆ నోట్ల ముద్రణ కూడా నిలిపివేసినట్లు ఆర్బీఐ తెలిపింది. గత మూడేళ్లలో ఒక్క రూ.2000 నోటు కూడా ముద్రించలేదని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది.

అయితే.. RBI రూ.2000 నోటును ఉపసంహరించుకునున్నట్లు తెలపడంతో… సోషల్ మీడియాలో మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో హీరో మంచు విష్ణు సైతం ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘నేను వెన్నెల కిషోర్ ఇంటికి వెళ్ళినప్పుడు కుప్పలుగా ఉన్న రూ.2000 నోట్లను చూసి ఆశ్చర్యపోయి ఫోటో తీశాను. ఆయన ఈ నోట్లను ఏం చేస్తారో’ అని ఓ ఫోటో పోస్ట్ చేశారు. దీనిపై కిషోర్ స్పం దిస్తూ… నా మీద పడతారేంటి అని రిప్లై ఇచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version