ఎన్నో విమర్శలు.. మరెన్నో అవమానాలు.. చివరికి గ్లోబల్ స్టార్ గా ఎదిగిన మెగా వారసుడు

-

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ తనయుడుగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రామ్ చరణ్ ఎంట్రీ సక్రమంగా జరిగిన తర్వాత మాత్రం ఎన్నో విమర్శల పాలయ్యారు. చివరికి తన కృషి, తపనతో అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి సంపాదించి చరిత్ర తిరగరాశారు.

తండ్రి నట వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు రామ్ చరణ్. టాలీవుడ్ లో నెంబర్ వన్ గా కొనసాగుతున్న చిరంజీవి మెగా వారసత్వాన్ని కొనసాగించడం అంత తేలికైన విషయం కాదు. అయినప్పటికీ నమ్మకంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చరణ్ ప్రారంభంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవలసి వచ్చింది. ఎందరో విమర్శించారు. నటన రాదంటూ, అందంగా లేడంటూ, అసలు హీరోగానే పనికిరాడు అంటూ పలు రకాలుగా విమర్శించారు. చివరికి ఒక్కొమెట్టు ఎక్కుతూ నేడు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నారు రామ్ చరణ్.

2007లో 22 ఏళ్ల వయసులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిరుత సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు రామ్ చరణ్.

మొదటి సినిమాతోనే హిట్ నందుకు ఉన్న ఈ హీరో రెండో సినిమా రాజమౌళి దర్శకత్వంలో నటించారు. మగధీర సినిమా రికార్డులను బద్దలు కొట్టింది.

అయితే ఈ సినిమా హిట్ నుంచి రామ్ చరణ్ కు అసలైన పరీక్ష మొదలైందని చెప్పుకోవాలి. ఇంత పెద్ద హిట్ అనంతరం ఆరెంజ్ మూవీ లో నటించగా ఆ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది. మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కినప్పటికీ ఆ సినిమా హిట్ కాలేదు. అయితే ఇక తను లవ్ స్టోరీలు ఎంచుకోవాలా వద్దా అని తికమకలో పడ్డానని, ఆ సమయంలో పెద్ద డైరెక్టర్లు సైతం తనతో పని చేయడానికి ఆసక్తి చూపించలేదని ఇప్పటికే పలుమార్లు చెప్పుకొచ్చారు రాంచరణ్.

ఈ డీజాస్టర్ అనంతరం నటించిన రచ్చ సినిమా కమర్షియల్ గా హిట్ అయినప్పటికీ చరణ్ కు నటన రాదని, ఎక్స్ప్రెషన్స్ పలకడం రాదంటూ పలు రకాలుగా విమర్శించారు. తర్వాత నటించిన నాయక్, ఎవడు చిత్రాల్లో సైతం చరణ్ నటన కు పెద్దగా మార్కులు పడలేదు. అనంతరం హిందీలో ప్రియాంక చోప్రా తో కలిసి నటించిన జంజీర్ సినిమా సైతం భారీ డిజాస్టర్ మూట కట్టుకుంది. ఈ సినిమాతో మరిన్ని విమర్శల పాలయ్యారు రామ్ చరణ్.

టాలీవుడ్ లో హీరోగా నిలదొక్కుకోవడమే ఎక్కువ ఇంకా బాలీవుడ్ ఎందుకు అంటూ పలు రకాలుగా విమర్శించారు. ఈ సినిమా తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన గోవిందుడు అందరివాడే చిత్రం డిజాస్టర్ గా మిగిలింది. ఇక ఈ సినిమాతోనే కోలుకోలేని దెబ్బ తిన్న రామ్ చరణ్ అనంతరం వచ్చిన బ్రూస్లీ సినిమా సైతం డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఈ పరాజయాలతో ఒకానొక స్థితిలో డిప్రెషన్స్ స్థాయికి వెళ్లానని చెప్పుకొచ్చారు రాంచరణ్. కెరియర్ లో ఎటు తేల్చుకోవాలో తెలియక వరుస పరాజయాలతో విమర్శల పాలవటం తనని మానసికంగా కుంగదీసిందని తెలిపారు.

ఈ బాధ లోంచి ఏదైనా సాధించాలని గట్టిగా అనుకున్నానని.. తపన, కృషితో ఎలాగైనా తానేంటో నిరూపించుకోవాలని తనని తాను మలుచుకున్న తీరు కోసం చెప్పుకొచ్చారు రామ్ చరణ్. కాగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ధ్రువ సినిమా లో రూట్ మార్చారు రామ్ చరణ్. శారీరకంగా, నటన పరంగా తనను తాను మెరుగుపరుచుకొని ఈ సినిమాలో మంచి మార్కులు సంపాదించుకున్నారు. అనంతరం సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో నటుడుగా మరో మెట్టు ఎక్కారు. అయితే అనంతరం వచ్చిన వినయ విధేయ రామ డిజాస్టర్ గా మిగిలినప్పటికీ ఈ సినిమా అనంతరం వచ్చిన ఆర్ఆర్అర్ మూవీస్ రామ్ చరణ్ కెరీర్ ను మలుపు తిప్పింది. ఈ సినిమాలో తన నట విశ్వరూపం చూపించి యాక్టింగ్ రాదు అన్న వారందరికీ సమాధానం ఇచ్చేశారు రాంచరణ్.

అర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి సంపాదించుకున్న రాంచరణ్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నార.

టాలీవుడ్ లోనే హీరోగా పనికిరాడు అంటూ విమర్శించిన వారందరికీ సమాధానం చెబుతూ హాలీవుడ్ స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం రామ్ చరణ్ కు హాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు క్యూ కడుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. తన పట్టుదల, కృషితో తనను తాను మలుచుకుంటూ ఉన్నత స్థాయికి ఎదిగినా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని లక్షణాన్ని తండ్రి నుంచి అందిపుచ్చుకున్న రామ్ చరణ్ సినీ ప్రస్థానం నిజంగా చెప్పుకోదగినదే..

Read more RELATED
Recommended to you

Exit mobile version