మెగా ఇంట పెళ్లిసందడి.. త్వరలోనే వరుణ్ తేజ్​ వివాహం

-

మెగా ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన తండ్రి నాగబాబు స్వయంగా చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగబాబు వరుణ్ తేజ్ పెళ్లెప్పుడు అని అడగ్గా సూపర్ న్యూస్ చెప్పారు.

“‘వరుణ్‌ తేజ్‌ పెళ్లి త్వరలోనే ఉంటుంది. వరుణ్‌ ఎవరిని పెళ్లి చేసుకోనున్నాడు అనే విషయంపై నేను ఇప్పుడే కామెంట్ చేయను. త్వరలోనే తనకు కాబోయే భార్య గురించి తనే స్వయంగా వెల్లడిస్తాడు. పిల్లలను కంట్రోల్‌ చేయాలని నేను ఎప్పటికీ అనుకోను. ఎవరి జీవితాలు వాళ్లు చూసుకోవాలనేది నా సిద్ధాంతం. అందుకే నేనూ-నా సతీమణి ఓచోట.. వరుణ్‌ విడిగా ఉంటున్నాడు. విడివిడిగా ఉన్నప్పటికీ మేమంతా ఒక్కటే”’’ అని నాగబాబు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version