తన కొడుకు రామ్ చరణ్ కు కొడుకు… పుట్టాలని మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చరణ్ కు కొడుకు పుడితే తనకు చాలా సంతోషం అన్నారు. తాజాగా ఓ సినిమా ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడారు. తన ఇల్లంతా మనవరాళ్లతో నిండిపోయిందని… ఇంట్లో ఉన్నప్పుడు అలా తనకు లేడీస్ హాస్టల్ వార్డెన్ లా ఉంటుందని మెగాస్టార్ చిరంజీవి బాంబు పేల్చారు.
ఒక అబ్బాయిని కనురా అంటూ రామ్ చరణ్ ను ప్రతిసారి అడుగుతానని… కానీ మళ్లీ వాళ్లకు ఆడపిల్ల పుడుతుందని భయపడుతున్నట్లు తెలిపారు. దీంతో మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. అటు తన పొలిటికల్ రీయంట్రీ పైన కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చిరంజీవి. రాజకీయాలకు దూరంగా ఉంటాను.. నేను పూర్తి చేయలేనిది నా స్థానంలో పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు అంటూ వెల్లడించారు మెగాస్టార్ చిరంజీవి.
"అరే చరణ్, ఈసారి ఓ వారసుడిని ఇవ్వారా… మన లెగసీ కొనసాగినట్టు ఉంటుంది!"
– Megastar Chiranjeevi's words at the #BrahmaAnandam pre-release event. pic.twitter.com/R8iWvABUHZ
— WC (@whynotcinemasHQ) February 11, 2025