వెన్నుపూసలో నొప్పి.. ఈ భంగీమలో పడుకుంటే మంచి రిలీఫ్ ఉంటుంది తెలుసా..!

-

నడుములో నొప్పికానీ, వెన్నుపూసలో నొప్పి ఉన్నప్పుడు కొన్ని ఆసనాలు చేస్తుంటే..రెండు మూడు నెలలకు నొప్పి తగ్గుతుంది. కానీ వీటితోపాటు పడుకునే పొజిషన్ కూడా చాలా ముఖ్యం. మనం పొడుకునే భంగీమ మన సమస్యను పెంచేవిధంగా ఉండకూడదు. చాలామందిలో బ్యాక్ పెయిన్, లోవర్ బ్యాక్ పెయిన్, సొయాటిక్ పెయిన్, డిస్క్ ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి. అలాంటివారు ఎలా పడుకోవాలి అని తెలియజేయడానికి ఈ కథనం మీకు బాగా ఉపయోగపడుతుంది.

నిద్రలో ఎటుపడితే అటు కదిలేస్తూ ఉంటాం. అది మన కంట్రోల్ లో ఉండదు. సాధ్యమైనంతవరూ ఇలాంటి సమస్యలు ఉన్నవారిని డాక్టర్లు బెడ్ రెస్ట్ తీసుకోమంటారు. అలా రెస్ట్ తీసుకునే సమయాల్లోనూ, రాత్రి పడుకునే ముందు మన భంగిమ ఎలా ఉండాలంటే..డిస్క్ పైనా, వెన్నుపూసలపైనా, నరాలపైన ఒత్తిడి తగ్గిండానికి, రిలాక్సేషన్ బాగా కలగడానికి ఫస్ట్ టెక్నిక్..

డిస్క్ బల్జ్ ఉన్నవారికి, డిస్క్ హెర్నియేషన్ ఉన్నవారికి నొప్పి తగ్గడానికి కుడి వైపు బాగా నొప్పి ఉందంటే..ఎడమవైపు తిరిగి పడుకోవాలి. అలాగే నొప్పి ఎడమవైపు ఉంటే..కుడివైపుకు తిరిగి పడుకోవాలి. ఆపోసిట్ డైరెక్షన్ లో పడుకోవాలని మాత్రం గుర్తుపెట్టుకోండి. సైడ్ కి తిరిగి రెండు కాళ్లను మేకాళ్ల దగ్గరనుంచి ఛాతీవరకూ ఎంతవీలైతే అంత మడవండి. రెండు కాళ్ల మధ్యలో ఒక దిండును పెట్టుకుని పడుకుంటే చాలా కంఫర్ట్ గా ఉంటుంది. సాధ్యనమైనంతవరకూ ఇలానే పడుకోండి.

డీ జనరేటీవ్ డిస్క్ ప్రాబ్లమ్ ఉన్నవారు బోర్లా పడుకోవాలి. పొట్టకింద దిండు పెట్టుకుని పడుకుంటే..డీ జనరేటీవ్ డిస్క్ ప్రాబ్లమ్ ఉన్నవారికి పూసల దగ్గర గ్యాప్ రావటం వల్ల ప్రజర్ బాగా తగ్గుతుంది. చక్కటి రిలాక్షేషన్ కలిగించటానికి ఇది మంచి టెక్నిక్. అయితే ఎక్కువ సేపు ఇలా పడుకుంటే కంఫర్ట్ ఉండదు. రెస్ట్ తీసుకునేప్పుడు ఇలా పడుకోండి. నిద్రపోయేప్పుడు కూడా ఇలానే పడుకుంటే..మధ్యలో ఎలాగో కదిలిపోతారు..కానీ ప్రయత్నం అయితే చేయండి.

లంబార్, శాక్రర్ బోన్స్ పై ప్రజర్ పడేవారికి ఇప్పుడు చెప్పుకోబేయే భంగిమ బాగా ఉపయోగపడుతుంది. అంటే..సీట్ పైన పూసల దగ్గర, సయాటిక్ పెయిన్, లోవర్ బ్యాక్ పెయిన్ వారు..వెల్లకిలా పడుకోండి. మోకాళ్ల కింద రెండు గుండ్రని దిండులు వేసుకోండి. గుర్తుపెట్టుకోండి..పాదాలకింద కాదు..మోకాళ్ల కింద పెట్టుకోవాలి. నడుము భాగం ఫ్లాట్ గా ఆనుతుంది. అలా ఆనినప్పుడు నరాలను వత్తటం అనేది బాగా తగ్గుతుంది. వాటి మీద భారం తొలిగి చాలా హాయిగా ఉంటుంది.

రెగ్యులర్ గా ఈ పెయిన్స్ ఉన్న వాళ్లు 8-9 గంటలపాటు రెస్ట్ తీసుకోవాలి. పనిచేసి ఇంటికి వచ్చినప్పుడు సోఫాలో ఎట్లాపడితే అలా కుర్చోకూడదు. వీటితోపాటు..బ్యాక్ బెండింగ్ ఎక్సర్ సైజ్ లు ఉంటాయి. అవి కూడా రోజుకు రెండుసార్లు చేస్తే..ఆ భాగాల్లో నొప్పి తగ్గుతుంది.

మసాజ్ లా చేయాలంటే..ఆవనూనె తీసుకుని అందులో కర్పూరం వేసి లైట్ గా వేడి చేసి రాసుకుని..వేడి నీళ్ల కాపడం లేదా వేడి నీళ్ల స్నానం చేస్తే..మంచి ఉపశమనం లభిస్తుంది.

ఇలాంటి టెక్నిక్ లను అన్నీ ఫాలో అవుతూ ఉంటే..నొప్పి నుంచి పూర్తిగా విముక్తి పొందవచ్చు. పెయిన్ కిల్లర్స్ వాడుతుంటే..అప్పటికప్పుడు ఉపశమనం ఉంటుంది కానీ, కిడ్నీలు దెబ్బతింటాయి. ఇంకా చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి..కాబట్టి నాచురల్గా నొప్పిని తగ్గించుకునే మార్గాలను పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version