ఈ జీవితమే అమ్మది.. చిరంజీవి మదర్స్‌ డే పోస్టు వైరల్

-

ఇవాళ మదర్స్‌ డే సందర్భంగా సోషల్ మీడియాలో #HappyMothersDay హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. నెటిజన్లు తమ తల్లితో దిగిన ఫొటోలు షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరోవైపు సెలబ్రిటీలు కూడా తమ అమ్మ పట్ల ఉన్న ప్రేమను చాటుకుంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్‌ మెగాస్టార్ చిరంజీవి కూడా తల్లి అంజనా దేవికి మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. జన్మనిచ్చి, పెంచి, పోషించిన అమ్మకు ఈ ఒక రోజు ఏంటి ..ప్రతి రోజు అమ్మదే.. ఈ జీవితమే అమ్మది.. అంటూ తల్లి, సతీమణి సురేఖతో కలిసి దిగిన ఫొటోను ట్వీట్ చేశారు.

ఇప్పుడీ స్టిల్ నెట్టింట వైరల్ అవుతోంది. సమయం వచ్చినప్పుడల్లా చిరంజీవి తన తల్లి గురించి మాట్లాడుతూనే ఉంటారు. తాను ఇంతటి స్థాయికి రావడానికి ఆమె పడిన కష్టం, చేసిన త్యాగాలను తరచూ గుర్తు చేసుకుంటారన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన ఈరోజు తన తల్లికి మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోస్టు కింద నెటిజన్లు కూడా అంజనా దేవికి మదర్స్ డే విషెస్ చెబుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version