ఎల్లుండి జీహెచ్ఎంసీలో సర్వసభ్య సమావేశం

-

జీహెచ్ఎంసీ రాజకీయం వేడెక్కింది. గురువారం జీహెచ్ఎంసీలో సర్వసభ్య సమావేశం జరుగనుంది. ఫిబ్రవరి 11 తరువాత మేయర్, డిప్యూటీ మేయర్ పై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో జీహెచ్ఎంసీలో మేయర్ తో కాంగ్రెస్ కార్పొరేటర్ల సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చించారు. రేపు బీఆర్ఎస్ అధిష్టానం ఆధ్వర్యంలో గ్రేటర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్పొరేటర్ల సమావేశం జరుగనుంది.

ఇదిలా ఉంటే.. అవిశ్వాసం పై మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ స్పందించారు. అవిశ్వాసంకు ఎంతమంది కావాలో కూడా బీఆర్ఎస్, బీజేపీకి తెలియదని విమర్శించారు. ఫిబ్రవరి 11తో నాలుగేళ్లు పూర్తి అవుతుంది. ఆ తరువాతే అవిశ్వాసం పెట్టాలన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కార్పొరేటర్లకు జీహెచ్ఎంసీ యాక్ట్ గురించి తెలియదని.. ఎంత మెజార్టీతో అవిశ్వాసం నెగ్గుతుందో కూడా తెలియదని ఆరోపించారు విజయలక్ష్మీ. బీజేపీ, బీఆర్ఎస్ ఈ విషయం పై కౌన్సిల్ సమావేశంలో రాద్దాంతం చేయాలని చూస్తే.. ఊరుకోమని మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version