80”s స్టార్స్ మీట్ లో ‘బంగారు కోడిపెట్ట’ సాంగ్ కు మెగాస్టార్ మెరుపు డ్యాన్స్… !! వీడియో వైరల్…!

-

మెగాస్టార్ చిరంజీవి సహా 1980ల సమయంలోని పలు భాషలకు చెందిన సినిమా నటులందరూ కూడా ఒక చోట చేరి, ఇటీవల ఒక అద్భుతమైన వేడుకను జరుపుకోవడం జరిగింది. వాస్తవానికి ప్రతి ఏడాది ఈ వేడుకను రాధిక లేదా సుహాసిని ఇంటి వద్ద జరుపుకునేవారు. అయితే ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి, తన సహ నటులందరికీ స్వగృహంలో ఈ వేడుక కోసం ఏర్పాట్లు చేయించారు. ఇక ఈ వేడుకలో తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, చిరంజీవి

 

కన్నడ భాషల నటులు పలువురు పాల్గొనడం జరిగింది. నాలుగు రోజుల క్రితం ఎంతో వైభవంగా జరిగిన ఈ వేడుక తాలూకు పిక్స్ ఇటీవల పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అయ్యాయి. కాగా కాసేపటి క్రిందట ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, ఖుష్బూ కలసి, ఘరానామొగుడు సినిమాలోని బంగారు కోడిపెట్ట సాంగ్ కి స్టేజిపై చిందేసిన వీడియో బయటకు రావడం జరిగింది. ఎంత వయసు మీద పడుతున్నప్పటికీ మెగాస్టార్ మాత్రం కుర్రాడిలా అదరగొట్టే స్టెప్పులతో స్టేజిని హోరెత్తించారు.

ఇక ఆయనతో కలిసి కాసేపటి తరువాత చిందేయడానికి సీనియర్ నటి జయప్రద విచ్చేసి, తన డ్యాన్స్ తో కాసేపు అందరినీ అలరించారు. అయితే బంగారు కోడిపెట్ట సాంగ్ కు మెగాస్టార్ డాన్స్ వేస్తున్న సమయంలో సుహాసిని, రాధికా, అక్కినేని నాగార్జున అరుపులు, నవ్వులతో మంచి జోష్ ని నింపడం వీడియోలో గమనించవచ్చు. ఇక ఈ వీడియో ప్రస్తుతం పలు సోషల్ మీడియా వేదికల్లో బాగా హల్ చల్ చేస్తోంది. ఇక ఈ వీడియోను చూసిన పలువురు ప్రేక్షకులు, మెగాస్టార్ కు ఏజ్ అనేది కేవలం నెంబర్ మాత్రమే నని, వయసు ఎంత పెరుగుతున్నప్పటికీ ఆయన డ్యాన్స్ లో ఉన్న ఈజ్ మాత్రం తగ్గలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు….!!

Read more RELATED
Recommended to you

Exit mobile version