రణ్‌వీర్- దీపికా పెళ్లికి అవి నిషేధం..!

-

 

బాలీవుడ్ నయా ప్రేమ జంట రణ్ వీర్ సింగ్, దీపికా పదుకునేలు పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధంగా ఉన్నారు. కొన్నాళ్ల నుండి నడుస్తున్న వీరి ప్రేమ వ్యవహారానికి పెళ్లితో సుఖాంతం కానుంది. ఇప్పటికే ఇరు కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి ఓకే చెప్పగా ప్రస్తుతం వీరు పెళ్లికి కావాల్సిన షాపింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దీపిక, రణ్ వీర్ లు ఇటలీలోని లొంబార్డ్ వేదికగా పెళ్లి చేసుకోనున్నారు.

ఈ పెళ్లికి కేవలం 30 మంది స్పెషల్ గెస్టులనే పిలిచినట్లుగా తెలుస్తోంది.. వారికి మాత్రమే ఆహ్వానాలు వెళ్లాయట. వీరి వివాహానికి విచ్చేసే అతిథులు, తమ మొబైల్స్‌ను తీసుకురావద్దొని ఈ జంట రిక్వెస్ట్ చేసిందట. పెళ్లికి సంబందించిన ఫోటోలు లీక్ కాకుండా పెద్ద ప్లాన్ చేశారు.  ఆ పిక్స్ తామే రిలీజ్ చేస్తామని వేరే వాళ్ల మొబైల్స్ నుండి అవి లీక్ అవడం ఇష్టం లేదని చెప్పారట.

నవంబర్ 20న వీరి పెళ్లి ఫిక్స్ చేశారు. అంతకు వారం ముందు మాత్రమే  ఎంగేజ్మెంట్ ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి బాలీవుడ్ హాట్ లవ్ కపుల్ పెళ్లితో ఒకటై క్రేజీగా మారనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version