దర్శకుడిగా ప్రముఖ నటుడు..త్వరలో సినిమా విడుదల

-

మాలీవుడ్ (మలయాళం) సంపూర్ణ నటుడు మోహన్ లాల్..నయా అవతారమెత్తారు. దర్శకుడిగా ఆయన దర్శకత్వంలో తొలి చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ తరుణంలో ట్విట్టర్ వేదికగా కెప్టెన్ ఆఫ్ ది షిప్ గా వ్యవహరిస్తున్నట్లు దిగిన ఫొటో ఒకటి మోహన్ లాల్ షేర్ చేశారు. ఆ ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.

నటుడిగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న మోహన్ లాల్..దర్శకుడిగానూ అంతే స్థాయి ముద్ర వేసుకుంటాడని ఈ సందర్భంగా నెటిజన్లు చర్చించుకుంటున్నారు. లాలెట్టా అదరగొట్టేస్తాడని అంటున్నారు. ‘బరోజ్’ అనే వాస్కోడిగామా నిధులు కాపాడిన వ్యక్తికి సంబంధించిన కథను వెండితెరపైన మోహన్ లాల్ ఆవిష్కరిస్తున్నారు. ఇందులో హీరోగా నటిస్తూనే మోహన్ లాల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 24న విడుదల కానుంది.

మాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. గుబురు గడ్డంతో గాగుల్స్ ధరించి ఉన్న మోహన్ లాల్ ను చూసి నెటిజన్లు ‘వాహ్..లాలెట్టా..’, ‘సూపర్ హీరో, ’, ‘ కంప్లీట్ యాక్టర్’ అని అంటున్నారు. మోహన్ లాల్ నటించిన ‘12th Man’ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ వేదికగా ఇటీవల విడుదలైంది. ఈ ఓటీటీ ఒరిజనల్ కు ప్రేక్షకుల నుంచి చక్కటి స్పందన వచ్చింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version