మోక్షజ్ఞ ఎంట్రీ.. ఈసారి కూడా అభిమానులకు నిరాశేనా..?

-

నటసింహ నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ కిడ్స్ ఉన్నా కూడా మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ కోసం అందరూ ఎక్కువగా చర్చించుకుంటున్నార. కొన్ని సంవత్సరాలుగా టాలీవుడ్లోకి ఆయన ఎంట్రీ ఇస్తారు అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నా .. ఇప్పటివరకు ఆ విషయం నిజం కాలేదు.. ఇక ఇండస్ట్రీలోకి రావడానికి నటనలో శిక్షణ తీసుకొని స్లిమ్ గా హీరో మెటీరియల్ గా మారిన ఆయన తనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్నాడే కానీ .. ఇప్పటివరకు ఇండస్ట్రీలోకి వస్తున్నామన్న విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.

మరొకవైపు రీసెంట్గా భగవంత్ కేసరి సెట్స్ ను సందర్శించడంతో ఈసారి అతిథి పాత్రలో నటించబోతున్నాడు అంటూ వార్తలు వినిపించాయి. కానీ నేడు మాత్రం ఈ విషయంలో నందమూరి అభిమానులకు తీవ్రమైన నిరాశ మిగిలిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈరోజు మోక్షజ్ఞ పుట్టిన రోజు నందమూరి అభిమానులు సంబరాలు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా మోక్షజ్ఞకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మోక్షజ్ఞకు ఇది 29వ పుట్టినరోజు అంటే ఈ వయసు నాటికి ఎన్టీఆర్, బాలకృష్ణ స్టార్ హీరోలుగా మారిన సందర్భం.. కానీ మోక్షజ్ఞ మాత్రం ఇంకా ఎంట్రీ కే నోచుకోలేదు. దీంతో అభిమానులు చాలా బాధపడుతున్నారు.

ఆయన పుట్టిన రోజు కదా కనీసం ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని ఎంతోమంది ఎదురుచూసినప్పటికీ అందరికీ నిరాశ మిగిలిందనే చెప్పాలి. అందుకే అభిమానులంతా కూడా మోక్షజ్ఞకు బర్తడే విషెస్ చెబుతూనే సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ గురించి అడుగుతున్నారు. ఇకపోతే మోక్షజ్ఞ మొదటి సినిమాను టాలీవుడ్ కి చెందిన బడా డైరెక్టర్ చేతిలో బాలకృష్ణ పెట్టబోతున్నట్లు కొద్దిరోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే ఎవరు ఆ డైరెక్టర్ అన్న విషయం ఇంకా క్లారిటీ లేదు. చూడాలి మరి ఎప్పుడు ఎవరితో మోక్షజ్ఞ లాంచింగ్ అవుతారో..

Read more RELATED
Recommended to you

Exit mobile version