గుర్తుప‌ట్ట‌లేని స్థితిలో `సీతారామం` భామ‌..అసలు ఏమైంది..?

-

‘సీతా రామం’.. ఓ సాధారణ చిత్రంగా విడుదలై ప్రేక్షకుల మదిని కన్నీటితో బరువెక్కించిన మధుర కావ్యం. హను రాఘవపూడి దర్శకుడు. ఇంతకాలం థియేటర్లలో అలరించిన ఈ సినిమా శుక్రవారం నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా అందుబాటులోకి వచ్చింది సీతా, రామ్‌గా మృణాల్‌ ఠాకూర్‌, దుల్కర్‌ సల్మాన్‌ చెప్పిన ప్రతి మాటా.. పలికించిన ప్రతి భావాన్నీ నెటిజన్లు ఆస్వాదిస్తున్నారు. తమకు నచ్చిన సన్నివేశాలను సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తున్నారు.

ఈ చిత్రంలో రామ్ గా దుల్కర్, సీతగా మృణాల్ తమదైన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఈ పాత్రలకు తాము తప్ప ఎవరు సరిపోరు అన్నంతల మైమరపించారు. ఈ మూవీ తర్వాత మృనాల్ కు ఆఫర్లు వెల్లువెత్తుతాయి. ఇలాంటి తరుణంలో ఆమెకు సంబంధించి ఓ పిక్ నెట్టింట వైరల్ గా మారింది. ఆ పిక్ లో మృనాల్ గుర్తుపట్టలేని స్థితిలో దర్శనమిచ్చి అందరికీ షాక్ ఇచ్చింది.

ఆమె ముఖం, చేతులు కమలిపోయినట్లు కనిపించాయి. అసలు మృనాల్ కు ఏమైంది? ఇది ఎప్పటి ఫోటో? ఏదైనా సినిమా కోసం ఆమెను అలా తయారు చేశారా? లేక ఇంకేదైనా జరిగిందా? అంటూ ఆ ఫోటోపై నేటిజన్లు ఆరాలు తీయడం స్టార్ట్ చేశారు. మరోవైపు ఈ పిక్ ను చూసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇదో ఓల్డ్ పిక్ అని, ఏదో సీరియల్ లోని పాత్ర కోసం ఆమె అలా డిగ్లామర్ లుక్ లో మేకవర్ అయిందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version