Mrunal Thakur To Enter Kollywood : సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రేక్షకులు ఇప్పటికీ ఆమెను సీత గానే గుర్తుపెట్టుకున్నారు సీత గానే ఆరాధిస్తున్నారు. కానీ ఆమె మాత్రం సోషల్ మీడియాలో పూర్తి భిన్నంగా ప్రవర్తిస్తోందని చెప్పాలి. ఇక..ఈ బ్యూటీ ఇటీవల డేటింగ్ పుకార్లతో పదేపదే వార్తలలో నిలుస్తున్నారు.
ఇది ఇలా ఉండగా, సీతారామం, హాయ్ నాన్న చిత్రాలతో సూపర్ హిట్ లు అందుకున్న హీరోయిన్ మృణాలు ఠాకూర్ కోలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నారు. రవికుమార్ డైరెక్షన్ లో రాఘవ లారెన్స్ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో హీరోయిన్ గా ఈమెను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అలాగే లారెన్స్ చేస్తున్న మరో ప్రాజెక్టులోను మృణాల్ నే కథానాయకగా తీసుకోనున్నట్లు సమాచారం. కొత్త ఏడాదిలో ఈ రెండు చిత్రాలకు ఆమె సైన్ చేయ బోతున్నారట.