రేసింగ్ టీమ్ కొనుగోలు చేసిన నాగచైతన్య

-

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెత సినిమా ఇండస్ట్రీకి చక్కగా సరిపోతుంది. అవకాశాలున్న రోజుల్లోనే సంపాదించి.. ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడంలో సినిమావోళ్లకు ఎవరూ సాటిరారు. ఇప్పటికే చాలా మంది నటులు.. యాక్టింగ్తో పాటు సైడ్ బిజినెస్లు చాలా పెట్టుకున్నారు. ఆ జాబితాలో టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య కూడా ఉన్నాడు. ఇప్పటికే ఈ హీరో షోయూ అనే రెస్టారెంట్తో ఫుడ్ బిజినెస్లో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇక కార్‌ రేసింగ్స్, ఫార్ములా వన్ పోటీలంటే ఎంతో అమితంగా ఇష్టపడే నాగచైతన్య తాజాగా అందులో భాగస్వామిగా మారాడు. ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్‌లో పోటీ పడే హైదరాబాద్‌ బ్లాక్‌ బర్డ్స్‌ ఫ్రాంచైజీని నాగచైతన్య కొనుగోలు చేశాడు. ఇండియన్ రేసింగ్‌ ఫెస్టివల్‌లో మొత్తం ఆరు టీమ్‌లు పోటీ పడుతున్నాయి. ఇందులో బాలీవుడ్ నటులు అర్జున్ క‌పూర్‌, జాన్ అబ్ర‌హం, మాజీ క్రికెట‌ర్ సౌర‌భ్ గంగూలీ టీమ్స్ కూడా ఉన్నాయి. ఆగస్టు 24వ తేదీన చెన్నై వేదికగా IRF మొదటి రౌండ్ పోటీ ప్రారంభం కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version