Karimnagar: మీ కాళ్లు మొక్కుతా.. దయచేసి రిజిస్ట్రేషన్ ఆపండి అంటూ ఓ యువకుడు ఆందోళన వ్యక్తం చేశాడు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత…భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. అయినా.. కూడా భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో గొడవలు జరుగతూనే ఉన్నాయి. అయితే.. తాజాగా మీ కాళ్లు మొక్కుతా.. దయచేసి రిజిస్ట్రేషన్ ఆపండి అంటూ ఓ యువకుడు ఆందోళన వ్యక్తం చేశాడు.
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు గుండ్లపల్లి గ్రామానికి చెందిన బేతల్లి రాజు తన సోదరి, తల్లి తనకు తెలియకుండా భూమి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారని, రిజిస్ట్రేషన్ ఆపాలని ఎమ్మార్వో కాళ్లు మొక్కుతూ కన్నీటి పర్యంతమయ్యాడు. ఉమ్మడి ఆస్తి నుంచి రెండు ఎకరాల 25 గుంటల భూమిని ఎవరికి తెలియకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.
మీ కాళ్లు మొక్కుతా.. దయచేసి రిజిస్ట్రేషన్ ఆపండి!
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు గుండ్లపల్లి గ్రామానికి చెందిన బేతల్లి రాజు తన సోదరి, తల్లి తనకు తెలియకుండా భూమి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారని, రిజిస్ట్రేషన్ ఆపాలని ఎమ్మార్వో కాళ్లు… pic.twitter.com/mbenzC4sui
— Telugu Scribe (@TeluguScribe) February 1, 2025