నాని ఒప్పుకుంటే సీక్వల్ చేస్తా – నాగ్‌

-

నాగార్జున, నాని కలిసి చేసిన మల్టీస్టారర్ మూవీ దేవదాస్. శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ఆడియో వేడుక గురువారం సాయంత్రం హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఆడియో వేడుకలో ఛాన్స్ వస్తే నానితో ఈ సినిమా సీక్వల్ చేస్తా అంటున్నాడు నాగార్జున. నానితో సినిమా చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నా ఏదైనా మనసులో గట్టిగా అనుకుంటే జరిగిపోతుంది.. దేవదాస్ లో నాని నటించినందుకు థ్యాంక్స్ అన్నాడు నాగార్జున.

దేవదాస్ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు నాగార్జున. వినాయక చవితి, దసరా పండుగల్లా 27న రిలీజ్ అవుతున్న దేవదాస్ సినిమా పండుగ కూడా చేసుకుందామని అన్నాడు నాగార్జున. మరి నాగార్జున, నాని కలిసి చేసిన దేవదాస్ మూవీ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇస్తుందో చూడాలి.

సినిమా ట్రైలర్ చూస్తే కామెడీ ఎంటర్టైనర్ గా అనిపిస్తుంది. ఆకాక్ష సింగ్, రష్మిక మందన్న హీరోయిన్స్ గా నటిస్తున్న దేవదాస్ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వనిదత్ నిర్మించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version