విజయవాడ దుర్గమ్మ భక్తులకు ప్రసాదంగా బెల్లప్పం..

-

విజయవాడ కనకదుర్గ, బెజవాడ దుర్గమ్మ.. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ.. ఇలా ఎన్నో పేర్లతో విజయవాడలో కొలువై ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాదు.. దేశంలోని నలుమూలల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. తిరుపతి తర్వాత ఎక్కువగా భక్తులు దర్శించుకునేది బెజవాడ కనకదుర్గమ్మనే. దుర్గమ్మకు అంత ప్రాధాన్యం కూడా. అందుకే.. భక్తుల సౌకర్యార్ధం, అమ్మకు గుర్తుగా భక్తులకు సరికొత్త ప్రసాదాన్ని అందించడానికి అధికారులు సమాయత్తమవుతున్నారు.

అక్టోబర్ 10 నుంచి కనకదుర్గమ్మ గుడిలో దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈసందర్భంగా భక్తుల కోసం అప్పం అనే ప్రసాదాన్ని ఉచితంగా అందించాలని భావిస్తున్నారు. సాధారణంగా అమ్మవారికి బెల్లం, బియ్యంతో చేసిన నైవేద్యం సమర్పిస్తుంటారు. పొంగలి, బెల్లప్పాలను కూడా అమ్మవారికి సమర్పిస్తుంటారు. దీంతో భక్తులను బెల్లప్పాలను ప్రసాదం ఇవ్వాలని నిర్ణయించారు. ప్రస్తుతం భక్తులకు పులిహోరను ఉచితంగా ఇస్తున్నారు. కనకదుర్గమ్మను రోజు 20 నుంచి 25 వేల మంది దాకా దర్శించుకుంటారు. సెలవు దినాలు, పండుగ రోజుల్లో అంతకంటే ఎక్కువమందే వస్తుంటారు.

తిరుపతిలో భక్తులకు లడ్డూను ఉచితంగా అందించడం అందరికీ తెలిసిందే. తిరుపతి లడ్డూ అంటూ అందరికీ తెలుసు. అది ఎంత మధురంగా ఉంటుందో కూడా అందరికీ తెలుసు. దానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు కూడా లభించింది. దీంతో బెజవాడ దుర్గమ్మ భక్తులకు ఇచ్చే ప్రసాదం కూడా ప్రత్యేకతతో కూడినదిగా ఉండాలని అధికారులు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version