41 ఏళ్లలో తల్లి కాబోతున్న హీరోయిన్ నమిత !

-

తన అందాలతో ఎక్స్ పోజింగ్ తో ఒకప్పుడు టాలీవుడ్ కుర్రకారుకు నిద్ర లేకుండా చేసిన నమిత(Namitha)ను ఎప్పటికీ టాలీవుడ్ ప్రేక్షకులు మర్చిపోలేరు. కొంత కాలం పాటు ఈ అమ్మడు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా అందాల ఆరబోతే మెయిన్ ఎజెండాగా పెట్టుకుని అవకాశాలు సాధించుకుంది.

ఇలా ఎక్స్ పోజింగ్ చేస్తూ… కుర్రకారు మతులు చెడగొట్టిన ఈ ముద్దు గుమ్మ 2017లో తన ప్రియుడైన వీరేంద్రను పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. పెళ్లి తర్వాత అంతగా కనిపించకపోయినా ఈ అమ్మడుకి ప్రేక్షకుల్లో మాత్రం ఆదరణ తగ్గలేదు.

ఇది ఇలా ఉండగా తన ఫ్యాన్స్ కు నమిత గుడ్ న్యూస్ చెప్పింది. తాను ప్రెగ్నెంట్ అంటూ బేబీ బంప్ తో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. నా లైఫ్ లో కొత్త అధ్యాయం మొదలైంది. నేను ఇన్నాళ్లు కోరుకున్నది నీ గురించే నీకోసమే ప్రార్థించ అంటూ పుట్టబోయే బిడ్డ గురించి రాసి వచ్చింది నమిత. గుజరాత్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో సొంతం, జెమిని, నాయకుడు, బిల్లా, సింహ చిత్రాల్లో నటించింది. అయితే 41 సంవత్సరాలలో నమిత ప్రెగ్నెంట్ కావడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version