కుంభమేలా మోనాలీసాకు తప్పని తిప్పలు.. ఏకంగా ఫేక్ ఐడీలతో!

-

యూపీలోని ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో తన చాకు లాంటి కళ్లతో మెరిసిన బ్యూటీ మోనాలిసా ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకున్న విషయం తెలిసిందే.అందుకు తన నీలి రంగు కళ్లే కారణం. కుంభమేళాలో పూసలమ్ముతూ కనిపించిన ఆమెను చూసిన ప్రతి ఒక్కరూ చూపు తిప్పుకోకుండా ఉండిపోయారు.

పూసలమ్మే అమ్మాయికి హీరోయిన్ లాంటి అందం ఎలా సాధ్యమైందని అంతా షాక్ అయ్యారు.దీంతో మోనాలిసాకు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. ఆమె ఎక్కడ కనిపించినా ఆమెతో ఫోటోలు దిగేందుకు అక్కడి ఇండియన్ టూరిస్టులు,యువత, యూట్యూబర్స్ వెంటపడి ఆమెను ఇబ్బందులకు గురిచేసేవారు.

తాజాగా ఆమె ఫోటోలను వాడుకుని ఫేక్ డీపీలతో ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాలో ఖాతాలు ఓపెన్ అయ్యాయి. చందమామ లాంటి మోము, నీలి రంగు కళ్లతో ఈ సుందరి ఒక్కసారిగా నేషన్ వైడ్ ఫేమ్ సంపాదించుకుంది. ఆమెకు తన సినిమాలో చాన్స్ ఇస్తానని ఓ బాలీవుడ్ డైరెక్టర్ సైతం ప్రకటించిన విషయం తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version