Nandita Swetha: పసుపు చీరలో నందితా శ్వేత పరువాలు..కుర్రకారు మతి పోగొడుతున్న భామ

-

బ్యూటిఫుల్ హీరోయిన్ నందితా శ్వేత..‘ఎక్కడికి పోతావు చిన్నవాడు’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కన్నడ, తమిళ్ భాషల్లో అప్పటికే పలు చిత్రాల్లో కథానాయికగా నటించిన ఈ సుందరి.. ఆ భాషలతో పాటు తెలుగులోనూ సినిమాలు చేస్తోంది. ఇటీవల కాలంలో ఈ అమ్మడు బుల్లితెరపైన కూడా సందడి చేయడం స్టార్ట్ చేసింది.

‘ఢీ’ షో తో పాటు నవ్వుల కార్యక్రమాల్లో ‘జబర్దస్త్’ స్పెషల్ ఈవెంట్స్ లో కనబడుతోంది నందితా శ్వేత. అక్కడ తనదైన శైలి మాటలతో ప్రేక్షకులను అలరిస్తోంది ఈ అమ్మడు. తాజాగా ఈ భామ చీరకట్టులో దిగిన ఫొటోలు ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసింది. సదరు ఫొటోలు చూసి నెటిజన్లు అందం అమ్మాయి అయితే అది నందిత అని అంటున్నారు. ‘బ్యూటిఫుల్, గార్జియస్, సో లవ్లీ’ అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు.

పసుపు రంగు చీరలో తిలకం రంగు రవిక ధరించి అలా నడుముపై చేయి వాల్చి తగు ఆభరణాలు ధరించి అలా చూపు తిప్పుకోనివ్వకుండా అందాలను బయటపెట్టింది నందిత. అలా అటు వైపునకు చూస్తూ, కొంటెగా చూపులతో సైగలు చేస్తూ కైపెక్కించింది. నందిత.

సంప్రదాయానికి ప్రతీక అయిన చీర కట్టులోనూ అందాలను ఆరబోసింది ఈ సుందరి. ఈ ఫొటోలను నెటిజన్లు లైక్ చేస్తున్నారు. బ్యూటిఫుల్ హీరోయిన్, ‘ఢీ’ షో జడ్జి ప్రియమణి కూడా ఈ ఫొటోలను లైక్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ మోడ్ లో ఉన్న ఫొటోలో నందిత ఇంకా చాలా డిఫరెంట్ గా ఉందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version