నేచురల్ స్టార్ నాని.. పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి కలిసి బైక్‌పై షికారుకు వెళ్లారు. అయితే ఏ లాంగ్ డ్రైవ్‌కో లేదా.. అడ్వెంచరస్ రైడ్‌కో కాదండోయ్. ఉస్తాద్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఈ ఇద్దరూ బైక్‌పై వెళ్లారు. జక్కన్న సోదరుడైన కీరవాణి తనయుడు శ్రీసింహా కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఉస్తాద్’. కావ్యా కల్యాణ్‌రామ్ కథానాయిక. ఫణిదీప్ దర్శకత్వం వహించారు. రజనీ కొర్రపాటి, రాకేశ్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి నిర్మాతలు. చిత్రం శనివారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా గురువారం రాత్రి హైదరాబాద్‌లో ‘ఉస్తాద్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ ఈవెంట్‌కు వెళ్లిన రాజమౌళి.. ‘అబ్బాయిలు వాళ్ల తొలి బైక్‌ని ఎప్పటికీ మరిచిపోరని.. ‘ఉస్తాద్’ ట్రైలర్, టీజర్ కంటే ముందు బైక్ పోస్టర్‌ని విడుదల చేశారని.. అది చూశాక తన తొలి బైక్ జ్ఞాపకాలు గుర్తొచ్చాయని రాజమౌళి అన్నారు. అబ్బాయిలకి బైక్ వచ్చిన వెంటనే స్వేచ్ఛతో, రెక్కలు వచ్చి, ఎగిరిపోతున్న అనుభూతి కలుగుతుందని.. ఆ బైక్‌తో మొదలుపెట్టి పైలట్‌తో కథని కనెక్ట్ చేయడం నాకు బాగా నచ్చిన అంశమని’ అన్నారు.